గణేష్ విగ్రహ నిర్వాహణకు, మిలాద్ ఉన్ నబీ పండుగల నిర్వాహణకు కృతజ్ఞతలు తెలిపిన నిజామాబాద్ పోలీస్ కమీషనర్
నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)ఏడపల్లి సెప్టెంబర్ 19: నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో నిజామాబాద్ ,ఆర్మూర్, మరియు బోధన్ డివిజన్ లో వినాయక విగ్రహ ప్రతిష్టాపన నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ పండుగలు శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ జరుపుకోవడం జరిగింది. నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో దాదాపు 6000 వినాయక విగ్రహాలు ప్రతిష్ఠాపన అనంతరం భక్తులందరూ సాంప్రదాయ బద్ధంగా 9, 11 రోజుల పాటు మండపాలలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి తదుపరి వినాయక నిమర్జనం ఘనంగా నిర్వహించారు. గణేష్ ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే తేది: 16-9-2024 నా మహ్మద్ ప్రవక్త జన్మదిన సందర్బంగా నిజామాబాద్ కమీషనరేటు అంత 20 ప్రాంతాలలో ర్యాలీలు కూడా నిర్వహించారు. దీనికి అన్ని మతాల ప్రజలు స్వచ్చందంగా సహకరించి జయప్రదం చేయడం జరిగింది. వినాయక నిమర్జనం కోసం ప్రత్యేకంగా బాసర బ్రిడ్జి పద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం నందిపేట మండలంలోని ఉమ్మోడ గోదావరి బ్రిడ్జి వద్ద భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం వలన ప్రజలందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. చాలా ప్రాంతాలలో గణేష్ నిమార్జనం ఏర్పాట్లు పటిష్టంగా చేయడం జరిగింది. వేడుకలు ప్రశాంత వాతావరణంలో గణేష్ విగ్రహాల ప్రతీష్టాపన నిమజ్జనం మరియు మిలాద్ ఉన్ నబీ వేడుకలు అన్నింటికి సార్వజనిక్ గణేష్ మండలి మజీద్ కమిటీలు, విగ్రహ గణేష్ కమిటీలు మరియు అన్ని మతాల ప్రజలు, ప్రతీ ఒక్కరు పోలీస్ శాఖకు సహకరించడం జరిగింది. అదే విధంగా వివిధ శాఖల అధికారులు / సిబ్బంది ప్రత్యేకంగా రెవెన్యూ శాఖ గ్రామ పంచాయతి. మున్సిపాలటి, అబ్కారీ శాఖ, ఫైర్ సర్వీస్, ఎన్.సి.సి, గజ ఈతగాళ్లు అందరూ వారి సేవలను అందించారు. పత్రిక ప్రతినిధులు ఎలక్ట్రానిక్ మీడియా / ప్రింట్ మీడియా సిబ్బంది అందరూ కూడా సహకరించరు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీకల్మెశ్వర్ సింగెనవార్, ఐ.పి.యస్. ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు, తెలిపారు