విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలకు అండగా పోలీస్ శాఖ
ప్రజారక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీసులకు ఎస్బిఐ పోలీస్ సాలరీ ప్యాకేజ్
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా నవంబర్ 24
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం రోజున విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు ఎస్బిఐ పోలీస్ సాలరీ ప్యాకేజీ లో భాగంగా ఒక్కో కుటుంబానికి ఒక కోటి రూపాయల ఇన్సూరెన్స్ చెక్కులను కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం రాజచంద్ర పోలీస్ కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజారక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీసు కుటుంబాలకు అండగా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ సంవత్సర కాలంలో జరిగిన రెండు దుర్ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బంది అయినటువంటి మార్చిలో గాంధారి పోలీస్ స్టేషన్ కు చెందిన వడ్ల రవికుమార్ అర్ధరాత్రి విధుల్లో ఉండగా జరిగే రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగిందని,అలాగే ఏప్రిల్ నెలలో పిట్లం పోలీస్ స్టేషన్ చెందిన కానిస్టేబుల్ కే బుచ్చయ్య రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగిందని అన్నారు. విధి నిర్వహణలో ప్రజల రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి సేవలందించిన కానిస్టేబుళ్లను స్మరించుకుంటూ , వారి కుటుంబాల భవిష్యత్తు కోసం ఒక కోటి రూపాయల ఎస్బిఐ చెక్కులను అందించారు. అలాగే పోలీస్ శాఖ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. స్వర్గీయ కానిస్టేబుల్ రవికుమార్ భార్య సౌఖ్య ను డిపిఓలో జూనియర్ అసిస్టెంట్ గా నియమించినట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం పోలీస్ కానిస్టేబుల్ ల కుటుంబ సభ్యులు ఎస్బిఐ బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించిన జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర IPS కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ కె నరసింహారెడ్డి, ఎస్బిఐ బ్యాంకు అధికారులు, జిల్లా పోలీస్ కార్యాలయ ల అడ్మినిస్ట్రేటివ్ అధికారి కే లింగ నాయక్, సూపర్డెంట్ ఎస్.కె జమిల్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, జూనియర్ అసిస్టెంట్ అపూర్వ ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.