సీఎంఆర్‌ ఇంజనీరింగ్ కాలేజీ కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్‌ చేశారు

*మెడ్చల్‌లోని సీఎంఆర్‌ ఇంజనీరింగ్ కాలేజీ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. బీహార్‌కు చెందిన నంద కిశోర్‌, గోవింద్‌ కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.*

సీఎంఆర్‌ కాలేజీ చైర్మన్‌ చామకూర గోపాల్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. అమ్మాయిల హాస్టల్లోని బాత్రూమ్‌లలో తొంగిచూసినట్లు గుర్తించారు. *దురుద్దేశపూర్వకంగా అమ్మాయిల బాత్రూమ్‌లలో కిశోర్‌, గోవింద్‌ ఈ నీచ పనికి పాల్పడ్డారు. ఈ క్రమంలో కిశోర్‌, గోవింద్‌తోపాటు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.* మరోవైపు.. కాలేజీ డైరెక్టర్‌ మాదిరెడ్డి జంగారెడ్డి, ప్రిన్సిపల్‌ అనంతనారాయణ, వార్డెన్‌ ప్రీతిరెడ్డి, క్యాంపస్‌ వార్డెన్‌ ధనలక్ష్మిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థినులను ఉద్దేశించి కిశోర్‌, గోవింద్‌ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో.. విద్యార్థినుల ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోకుండా వదిలిపెట్టింది. దీంతో.. విద్యార్థినుల ఆందోళనలను పట్టించుకోనందుకు వారిపై కేసులు నమోదు చేశారు. విద్యార్థినుల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించినందుకు యాజమాన్యంపై కేసులు పెట్టారు.కాగా.. ఈనెల 2వ తేదీన హాస్టల్ బాత్‌రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు అమర్చినట్లు ఆరోపణలతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తాము స్నానం చేస్తుండగా వీడియోలు రికార్డ్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రైవసీపై దాడి జరిగిందని ఆరోపిస్తూ.. నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారకులను కఠినంగా శిక్షించాలని వారు తెలిపారు. విద్యార్థినులు ఆందోళన నేపథ్యంలో కాలేజ్ హాస్టల్ ఘటనలో వార్డెన్ ప్రీతి రెడ్డిని యాజమాన్యం సస్పెండ్ చేసింది.

Join WhatsApp

Join Now