నిరుపేదరాలి స్థలాన్ని కబ్జాచేసిన పోలీస్..!!

*నిరుపేదలకు ఇచ్చిన నివేశన స్థలాన్ని కబ్జా చేసిన పోలీస్ ఉద్యోగి*

డబ్బు,రాజకీయ అధికార అండదండలతో నిరుపేద భూములపై కన్ను*

జమ్మికుంట అక్టోబర్ 28 ప్రశ్న ఆయుధం:-*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం శివారులోని కోరపల్లి రోడ్ జమ్మికుంట పోలీస్ క్వార్టర్స్ ముందున్న సర్వేనెంబర్ 467/14 లో 1989లో నాటి ప్రభుత్వం నిరుపేదల కింద సుమారు 15 మంది లబ్ధిదారులకు స్థలాన్ని కేటాయించడం జరిగిందని కాగా నిరుపేద కుటుంబానికి చెందిన కీ.శే. రావుల సుశీల లకు ఫ్లాట్ నెంబర్ 15 లో 33 × 40 గల స్థలాన్ని కెటాయించడం జరిగిందని ప్రభుత్వం జారీ చేసిన నివేశన స్థల పట్టా ఆధారంగా 1990 లో నాటి కొత్తపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారికంగా అనుమతి తీసుకొని 60 రూపాయల చలానా కూడా తీసుకొని తాత్కాలిక ఇంటిని నిర్మించుకొని నివాసం ఉంటున్న తరుణంలో రావుల సుశీల అనారోగ్యానికి తీవ్ర గురికాగ తమ ఏకైక కుమారుడు రావుల ఠాకూర్ శ్రీధర్ సింగ్ తన తల్లిని బ్రతికించడం కోసం వెంటనే హనుమకొండ లోని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకువెళ్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ తల్లిని లక్షల రూపాయలు అప్పు చేసి బ్రతికించుకొని తమ వద్దనే ఉంచుకొని జీవనం సాగిన తరుణంలో తాత్కాలికంగా వేసుకున్న గుడిసె 

శిథిలావస్థకు చేరుకొని కూలిపోగా తమ కేటాయించిన స్థలం పై సమీపంలో ఉంటున్నటువంటి ఎస్సీ కులానికి చెందిన

గొట్టే హర్షవర్ధన్ తండ్రి గోవర్ధన్ కన్నేసి అక్రమంగా రేకుల షెడ్డు ను నిర్మించుకున్నాడని అట్టి విషయం తెలుసుకున్న మరణించిన రావుల సుశీల కుమారుడు అయినటువంటి రావుల ఠాకూర్ శ్రీధర్ సింగ్ కుమారుడు, తన భార్య వెళ్లి అడ్డుకొనగా ఎస్సీ కులానికి చెందిన గొట్టే హర్షవర్ధన్ కులం పేరుతో దూషించారని తన అక్రమంగా నిర్మించిన షెడ్డును కూల్చారని పట్టాదారురాలు రావుల సుశీల తమ కుమారుడు రావుల ఠాకూర్ శ్రీధర్ సింగ్ కోడలు కవిత మనుమడు శివ పేర్లపై జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నాటి పోలీస్ అధికారులు విచారణ జరిపి తప్పుడు కేసు కింద అట్టి కేసును కొట్టి వేయడం జరిగిందని తెలిపారు

నాటి నుండి తమ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్న గొట్టే హర్షవర్ధన్ జమ్మికుంట మున్సిపాలిటీ కార్యాలయంలో ఎలాంటి పత్రాలు సమర్పించకుండా సర్వే నెంబర్ వేయకుండా ఇంటి నెంబర్ తీసుకొని దొంగ పత్రాల ఆధారంగా బిజిగిరి గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ సర్దన రవీందర్ తల్లి యగు సర్ధన ఎల్లమ్మ పేరిట హుజరాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బాధితులు ఆరోపించారు అనంతరం సర్దన ఎల్లమ్మ పేరు నుండి తమ కుమారుడు అయిన ప్రభుత్వ ఉద్యోగి (కానిస్టేబుల్) సర్దన రవీందర్ పేరుతో 2020 లో సబ్ రిజిస్టర్ హుజురాబాద్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని నాటి నుండి నేటి వరకు జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం జమ్మికుంట పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ బాధితులకు ఎలాంటి న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు

సర్దన రవీందర్ పేరున రిజిస్ట్రేషన్ కావడంతో 2024 మార్చి నెలలో పక్కా భవనాన్ని నిర్మించుకోవాలని ముగ్గు పోసి పిల్లర్ గుంతలు తీస్తున్నారని తెలుసుకున్న బాధితులు అక్కడికి చేరుకోగా తమ నివేశన స్థలంలో ఎందుకు ఇంటిని నిర్మిస్తున్నావు అని ప్రశ్నించగా ఇది నాదే అందుకే పక్కా ఇళ్లు కడుతున్నానని దౌర్జనం, బెదిరించడంతో ఏమి చేయలేక బాధితులు 100 నెంబర్ కు డయల్ చేసి ఫిర్యాదు చేయగా జమ్మికుంట పోలీస్ స్టేషన్ నుండి పోలీస్ లు వచ్చి సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆ పనిని ఆపాలని సూచించంగా తాత్కాలికంగా నిలిపి వేయడం జరిగిందని బాధితులు తెలిపారు

ప్రభుత్వం సుమారు 15 మంది నిరుపేదలకు 1989 సం.లో నివేశన స్థలాలు జారీ చేయగా అట్టి భూమిని అక్రమార్కులు అధికారుల రాజకీయ అండదండలతో కబ్జాలు చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడడం దుర్మార్గమైన చర్య అని తమ నివేశి స్థలాన్ని కాపాడుకోవడం కోసం రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగుల వద్దకు వెళ్లిన అక్రమార్కులకు భయపడి అధికారులు కూడా నిమ్మకు నిరుత్తనట్లు వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్నారు

ప్రభుత్వం కేటాయించిన భూమిని దక్కించుకోవడం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమేనని బాధితులు తెలిపారు

దీనిపై ఉన్నత అధికారులు దృష్టి సాదించి ఆక్రమణకు గురి అయిన తమ నివేశస్థలాన్ని తమకు ఇప్పించాలని అక్రమంగా తమ నివేదన స్థలాన్ని అక్రమించి మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని బాధితులు రావుల ఠాగూర్ శ్రీధర్- కవిత కోరారు

Join WhatsApp

Join Now

Leave a Comment