Site icon PRASHNA AYUDHAM

తప్పిపోయిన పాపను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీస్ సిబ్బంది

IMG 20241109 WA0144

*తప్పిపోయిన బాలికలను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసు సిబ్బంది*

*జమ్మికుంట నవంబర్ 9 ప్రశ్న ఆయుధం::-*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొండూరు కాంప్లెక్స్ లో గల పార్కులో ఆడుకుంటున్న బాలిక కనపడకపోవడంతో తన తల్లి 100కు ఫోన్ చేయగా వెంటనే స్పందించి పోలీస్ సిబ్బంది పాప ఆచూకీ పట్టుకొని తల్లి అప్పచెప్పారు వివరాల్లోకి వెళితే తాండ్రాజుల సంజన తండ్రి రాజు తల్లి స్వప్న వయసు (8) సంవత్సరాలు బాలిక శనివారం రోజున తాత సమ్మయ్య గ్రామం మాచినపల్లి ప్రస్తుతం నివాసం ఉంటున్న కృష్ణ కాలనీలో ఉంటున్న సమ్మయ్య తన మనవరాలను సంజనను తీసుకొని కొండూరు కాంప్లెక్స్ లోని పార్కు తీసుకువెళ్లినాడు పాప ఆడుకుంటుందని తాత బయట వేరే వాళ్ళతో మాట్లాడుతుండగా పాప కనపడకపోయేసరికి పాప తల్లి విషయం తెలుసుకొని 100 డయల్ చేసి పోలీసులకు విషయం తెలుపగా వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బంది హడావుడిన అన్ని వైపులా వెతికి 20 నిమిషాలలో పాపను తన తల్లిదండ్రులు లకు అప్పజెప్పారు

Exit mobile version