యాత్రికుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు, గజ ఈతగాళ్లు.. 

సూర్యలంక తీరంలో యాత్రికుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు, గజ ఈతగాళ్లు.. 

బాపట్ల మండలం సూర్యలంక తీరంలో అలల తాకిడికి కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన పోలీసులు మరియు గజితగాళ్లు. హైదరాబాద్ పట్టణానికి చెందిన దయాకర్ మహేష్ కుటుంబం (40)బాపట్ల సూర్యలంక బీచ్ లో ఆహ్లాదకరంగా గడుపుతుండగా ఇంతలో ఒక్కసారిగా వచ్చిన రాకాసి అలల తాకిడికి 40 సంవత్సరాల వయసు కలిగిన దయాకర్ మహేష్ సముద్రంలోకి కొట్టుకుపోతుండడంతో అక్కడే విధులలో ఉన్న పోలీస్ సిబ్బంది, గజ ఈతగాళ్లు సముద్రంలోకి వెళ్లి యాత్రికుడి ప్రాణాలను రక్షించి ఒడ్డుకు చేర్చినారు.పోలీస్ సిబ్బంది గజ ఈతగాళ్లు స్పందించిన తీరు పట్ల యాత్రికులు హర్షం వ్యక్తం చేశారు. అతడి బంధువులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now