ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పదవి భర్తీ చేయాలి!
ఏపీఎస్ ఎస్ ఎస్ విశాఖ జిల్లా అధ్యక్షుడు వడ్డాది ఉదయకుమార్
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ చైర్మన్ ను నియమించడం ఎంతో ఆనందదాయకమైనప్పటికీ, ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఎవరిని నియమించకపోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య విశాఖ జిల్లా అధ్యక్షులు వడ్డాది ఉదయకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతోనే బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆ సమయంలో కార్పొరేషన్ ఎంతో అభివృద్ధి చెంది, బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని ఈ సందర్భంగా ఉదయకుమార్ గుర్తు చేశారు.తిరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి చేపట్టడంతో బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉత్సాహం మిన్నంటింది. అయితే ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవిలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి మినహా అన్ని కార్పొరేషన్లకు చైర్మన్ లను నియమించడం బ్రాహ్మణ సామాజి వర్గంలో నిరాశ కలిగించిందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ విజయానికి ఎంత కృషి చేసిన బ్రాహ్మణులగౌరవంపెంపొందడానికిముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాలయాల ట్రస్ట్ బోర్డు లో కూడా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని చెందిన వ్యక్తిని సభ్యునిగా నియమించడానికి క్యాబినెట్ లో ఆమోదించడం, అలాగే బ్రహ్మశ్రీ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు విద్యార్థుల నైతిక విలువల సలహాదారు పదవి కేటాయించడం పట్ల ఉదయకుమార్ హర్షం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గం మరింత బలోపేతం చేసేందుకు త్వరితగతిని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పదవి భర్తీ చేయాలని ఉదయకుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు.