*ఆర్ఓబి వంతెనపై గల గుంతను పూడ్చాలి*
*సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్*
*జమ్మికుంట నవంబర్ 7 ప్రశ్నా ఆయుధం::-*
జమ్మికుంట ఆర్ఓబి బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చాలని, నిత్యం వందలాది వాహనాలు వేలాది ప్రజలు తిరుగుతున్న ప్రమాదం ఏర్పడితే దీనికి ఎవరు బాధ్యులని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ ప్రశ్నించారు సిఐటియు ఆధ్వర్యంలో ఆర్వో బి బ్రిడ్జిపై నిరసన కార్యక్రమాన్ని తెలిపారు పట్టణంలో 30 మంది కౌన్సిలర్లు చైర్మన్ కమిషనర్ ప్రధాన రహదారి అయినా జమ్మికుంట నుండి హుజురాబాద్ కు ఉన్న, ఓర్ బ్రిడ్జి పైనుండి వెళ్తున్న, సంబంధిత శాఖ ఆర్ అండ్ బి గాని, స్థానిక మున్సిపల్ శాఖ గాని, పట్టించుకోకపోవడం, చాలా బాధాకరమైన పేర్కొన్నారు ఒకపక్క, ప్రభుత్వం, వాహనాల ద్వారా, టాక్సీ ల పేరిట, లక్షల కోట్ల రూపాయలు ఆదాయం పొందుతూ నంబర్ ప్లేట్లు లేవని ఇన్సూరెన్స్లు అయిపోయిన వాని ప్రమాదాలు జరుగుతున్నావని మోటార్ వెహికల్ వాహనదారులపై, వేళల్లో పన్నులు వసూలు చేస్తూ, పోలీస్ శాఖ తరపున కూడా ఫైన్లు వేసి లక్షల రూపాయలు ఆదాయం సమకూర్చుకుంటుంది కానీ, చెడిపోయిన రోడ్లను బాగు చేయడంలో, ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపరచడంలో, నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఆర్ఓబిపై వెళ్ళిన గల గుంతలను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు బైరం సమ్మయ్య, కుసుమ రవి, బండ సురేష్, సాగర్ల సారంగ పనులు పాల్గొన్నారు.