డీసీఎం వ్యాన్ ఓనర్స్ సంఘం అధ్యక్షుడుగా శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవం
జమ్మికుంట/ ఇల్లందకుంట /వీణవంక ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 17*
డీసీఎం వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ జమ్మికుంట ఇల్లందకుంట వీణవంక మండలాలకు చెందిన వ్యాన్ ఓనర్స్ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డిని ఎన్నుకొన్నారు సంఘ గౌరవాధ్యక్షులుగా పొన్నగంటి మల్లయ్యను డీసీఎం వ్యాన్ ఓనర్స్ ప్రధాన కార్యదర్శిగా దేవేందర్ ఉపాధ్యక్షుడిగా సంతు కార్యదర్శిగా సుధాకర్ కోశాధికారిగా మల్లారెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు పొన్నగంటి మల్లయ్య మాట్లాడుతూ సంఘ ప్రతిష్ట కోసం పాటుపడి ఎలాంటి సమస్యలు ఎదురైనా పరిష్కరించే దిశగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు గౌరవ అధ్యక్షునికి కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు