*ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియపరచడానికి వారధిగా పత్రికా రంగం ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది*
*
*ఇల్లందకుంట జనవరి 15 ప్రశ్న ఆయుధం*
ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియపరచడానికి వారధిగా గా ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పత్రికా రంగం ఎంతో ముఖ్యమైందని మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు అన్నారు అనంతరం ప్రజా దర్బార్ నూతన క్యాలెండర్ ను మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు తాసిల్దార్ రాణి ఎంపీడీవో పుల్లయ్య. ఏవో సూర్యనారాయణ ఎస్ఐ రాజకుమార్ డిటి పార్థసారథి బుధవారం ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ తన వంతు పాత్ర పత్రికలు కీలకంగా పోషిస్తున్నాయని ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా కొనసాగుతుందని ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని మేలుకొల్పే వార్తలను తెరపైకి తీసుకువస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బాలరాజు విలేకరులు లకిడే అనిల్ దొడ్డే కుమారస్వామి రమేష్. రావుల రాజేశం. నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.