అంగరంగ వైభవంగా నాభిశిల(బొడ్రాయి) దేవుడి ప్రతిష్టా మహోత్సవం 

అంగరంగ వైభవంగా నాభిశిల(బొడ్రాయి) దేవుడి ప్రతిష్టా మహోత్సవం

ప్రశ్న ఆయుధం మే18: శేరిలింగంపల్లి ప్రతినిధి

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మదినగూడలో అంగరంగ వైభవంగా నిర్వహించిన నాభిశిల (బొడ్రాయి) దేవుడి ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథరెడ్డి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ఆరెకపూడి గాంధీని రఘునాథ్ రెడ్డిని శాలువాలతో గౌరవప్రదంగా సత్కరించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ఆవరణలో భక్తులకు అన్న ప్రసాదాలను అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్త జనులు అధిక సంఖ్యలో పాల్గొని నాభిశిల(బొడ్రాయి) దేవుడి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Join WhatsApp

Join Now