హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కల సమస్య రోజురోజుకూ తీవ్రం అవుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా మనుషులపై దాడి చేసి పిక్కలు పీకుతున్నాయి. ఈ క్రమంలోనే వీధి కుక్కల సమస్యపై తెలంగాణ హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీకి, అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ – జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారికి షాక్ ఇచ్చింది. వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చింది.హైదరాబాద్ నగర పరిధిలో వీధి కుక్కలకు ఫుడ్ అందించేవారికి జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. ఇక నుంచి వీధి కుక్కలకు ఎక్కడ పడితే అక్కడ భోజనం పెట్టడం కుదరదని తేల్చి చెప్పింది. ఇక నుంచి వీధి కుక్కలకు భోజనం పెట్టాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అలా వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు.. అధికారులు కొన్ని ప్రాంతాలను కేటాయిస్తారని..
Latest News
