Site icon PRASHNA AYUDHAM

గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

IMG 20240802 185308

Oplus_0

సంగారెడ్డి/హత్నూర, ఆగస్టు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలని కల్లుగీత కార్మిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్న గౌడ్, ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ లు డిమాండ్ చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దేవులపల్లిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి ఉత్సవాలలో భాగంగా పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆశన్నగౌడ్, రమేష్ గౌడ్ లు మాట్లాడుతూ.. జిల్లాలో ఆగస్టు 2 నుండి 18 వరకు అమరుల యాదిలో

గీతన్నల చైతన్య యాత్ర కొనసాగుతుందన్నారు.

శుక్రవారం హత్నూర మండలంలోని దౌల్తాబాద్, మల్కాపూర్, వడ్డేపల్లి, నాగారం, శేర్కాన్ పల్లి గ్రామాలలో కొనసాగిందని వారు పేర్కొన్నారు. కల్లుగీత కార్మిక సంఘం జెండాను ఆవిష్కరించి, అమరవీరుల యాది సభను నిర్వహించడం జరిగిందన్నారు. కల్లుగీత కార్మికుల హక్కుల కొరకు పోరాడి అమరులైన గౌడ కుల సంఘం నాయకులను యాది చేసుకుంటూ ఏడు రోజుల పాటు జిల్లాలో యాత్ర కొనసాగనుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కల్లు గీత కార్మికుల ఉపాధి కోసం గౌడ కులస్తుల సంక్షేమం కోసం కేవలం 68 కోట్లు మాత్రమే కేటాయించిందని, ఇది ఏ మూలకు సరిపోదని వెంటనే 5000 కోట్లు కేటాయించాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్న గౌడ్, జిల్లా కార్యదర్శి ప్రసాద్ గౌడ్, సంగారెడ్డి మండల ఉపాధ్యక్షుడు కృష్ణ గౌడ్, గౌడ జన హక్కుల పోరాట సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా గౌడ్, జిల్లా నాయకులు ఆంజనేయులు గౌడ్, నాయకులు శేఖర్ గౌడ్ , సురేష్ గౌడ్, దేవులపల్లి రంగన్న గౌడ్, లచ్చన్న గౌడ్, యాదాగౌడ్, సుదర్శన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నవీన్ గౌడ్, రమేష్ గౌడ్, మల్లేశం గౌడ్, నాగన్న గౌడ్, మల్ల గౌడ్, ప్రదీప్ గౌడ్, నిఖిల్ గౌడ్, శంకర్ గౌడ్, చిన్న పోచాగౌడ్, పెద్ద పోచాగౌడ్, భాషాగౌడ్, జగన్ గౌడ్, శేఖర్ గౌడ్, వాసు దేవ్ గౌడ్, పాండు గౌడ్, రమేష్ గౌడ్, అంజాగౌడ్, చిన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version