ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్య బోధిస్తున్న గెస్ట్ లెక్చరర్స్ సమస్యలను పరిష్కరించాలి..

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్య బోధిస్తున్న గెస్ట్ లెక్చరర్స్ సమస్యలను పరిష్కరించాలని

– విద్యార్థి సేన జిల్లా అధ్యక్షులు కొత్మీర్కర్ వినయ్ కుమార్

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్య బోధిస్తున్న గెస్ట్ లెక్చరర్స్ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సేన జిల్లా అధ్యక్షులు కొత్మీర్కర్ వినయ్ కుమార్ అన్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యార్థి సేన ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్య బోధిస్తున్న గెస్ట్ లెక్చరర్స్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. వారికి కనీస ఉద్యోగ భద్రత లేకపోవడం బాధపడవలసిన విషయమని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలు గెస్ట్ లెక్చరాల మీద ఆధారపడి నడుస్తున్నాయి అన్నారు. అవర్లి బేస్డ్ పేమెంట్ రద్దుచేసి కన్సలిడెండ్ పేమెంట్ ఇవ్వాలన్నారు. అలాగే గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులను ప్రభుత్వం చిన్న చూపు చూడడం సిగ్గుచేటు అన్నారు. ఎస్ ఎస్ ఏ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయలేని పక్షంలో కనీస పే స్కేల్ అన్న ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సేన నాయకులు సాయిరాం, ప్రభాకర్, రాహుల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now