బోడుప్పల్‌లో ఘటాల ఊరేగింపు: కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వజ్రేష్ యాదవ్, నాయకుల హాజరు

*బోడుప్పల్‌లో ఘటాల ఊరేగింపు: కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వజ్రేష్ యాదవ్, నాయకుల హాజరు*

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ప్రశ్న ఆయుధం జూలై 27

బోనాల పండుగను పురస్కరించుకొని బోడుప్పల్‌లో మాజీ ఎంపీటీసీ సభ్యులు దేవరకొండ వీరాచారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఘటాల ఊరేగింపు కార్యక్రమంలో మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పోగుల నర్సింహా రెడ్డి, మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, సీనియర్ నాయకులు నర్సింగ్ రావు గుప్త, బొమ్మకు రమేష్, మాజీ కార్పొరేటర్లు బొమ్మకు కళ్యాణ్, రసాల వెంకటేష్ యాదవ్, మహేందర్ యాదవ్, సుమన్ నాయక్, ధనగాళ్ల యాదగిర్, పుల్లకండ్ల జంగా రెడ్డి, తోటకూర రవీందర్ యాదవ్, ఇతర మాజీ ప్రజాప్రతినిధులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now