ప్రజలు పాటించే రహదారి నియమాలతోనే దేశ పురోగతి

*ప్రజలు పాటించే రహదారి నియమాలతోనే దేశ పురోగతి*

-జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి

ప్రశ్న ఆయుధం, కామారెడ్డి :

పౌరులు పాటించే రహదారి నియమాలను బట్టే దేశ పురోగతి ఆధారపడి ఉంటుందని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా కామారెడ్డి మండలం నరసన్నపల్లి విద్యానికేతన్ పాఠశాలలో రోడ్డు భద్రత, పౌరుల పాత్ర పై క్విజ్ పోటీలు, డిబేట్ నిర్వహించారు. ఈ కార్యకమంలో ఆయన పాల్గొని వివిధ విద్యాలయాలనుంచి పాల్గొన్న విద్యార్థులని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా

ప్రథమ స్థానంలో పబ్బ కేయూరి ఎస్పీఆర్ స్కూల్, ద్వితీయ స్థానంలో షహన్ మూతహర్ ఆర్కిడ్ స్కూల్, తృతీయ స్థానంలో నాగచంద్ర వాగ్దేవి స్కూల్, రాజా శ్రీఆంశ్ శాంతినికేతన్ స్కూల్ విద్యార్థులు నిలిచారు. విజేతలను మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ జె.శ్రీనివాస్, సహాయక మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ జె.కవిత, విద్యానికేతన్ ప్రిన్సిపాల్ ప్రియానాయుడు అభినదించారు.

Join WhatsApp

Join Now