కామారెడ్డి ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి..

కామారెడ్డి జిల్లా కేంద్రాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాలి..

 ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి..

– కామారెడ్డి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథిగృహంలో స్థానిక విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించరు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతున్నారని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో విద్యారంగంలో మండలానికి ఒక మోడల్ స్కూల్ ని తన సొంత డబ్బులతో నిర్మిస్తామని చెప్పి గెలిచి సంవత్సరం దగ్గర పడుతున్న కానీ విద్యారంగానికి ఇచ్చిన హామీలను మర్చిపోయారని అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయడానికి అనేక రకాల సౌకర్యాలు ఉన్న ప్రజా ప్రతినిది ఎమ్మెల్యే చొరవ చూపకపోవడం తమ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే తమ మేనిఫెస్టోలో చెప్పిన 150 కోట్లా తో ఇచ్చిన హామీలను అమలు చేసి ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. భవిష్యత్ కార్యాచరణ కొరకు ఈ నేల 27 తేదీన బుదవారం స్థానిక జిల్లా కేంద్రంలో కామారెడ్డి ఎడ్యుకేషన్ అభివృద్ధికై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగుతుందనీ అని తెలుపుతున్నామన్నారు. రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు హాజరై కామారెడ్డి అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముదం అరుణ్ కుమార్, భారతీయ విద్యార్థి మోర్చా బివిఎం రాష్ట్ర కార్యదర్శి ఙివియం. విఠల్, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు కుంబల లక్ష్మణ్ , ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఐరెని సందీప్ కుమార్, జీవీఎస్ జిల్లా అధ్యక్షులు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment