Site icon PRASHNA AYUDHAM

ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్

ప్రశ్న ఆయుధం, నవంబర్ 21, కామారెడ్డి :

ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కామారెడ్డి జిల్లా తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ కోరారు. గురువారం ప్రపంచ మత్స్య కారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాన్సువాడ డివిజన్ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ముదిరాజ్ మహాసభ దశాబ్ది ఉత్సవాలు, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం అభయ హస్తంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుల ఆదేశానుసారం పల్లె పల్లెనా ముదిరాజ్ జెండా ఎగర వేయడంతో పాటు మత్స్య కారుల జీవితాలను బాగుచేయడానికివెంటనే 1000 కోట్ల రూపాయలు విడదల చేయాలని డిమాండ్ చేశారు. ముదిరాజుల గుండెల్లో చైతన్యం నింపిన ఎజెండా… మొట్ట మొదటి సారి “ముదిరాజులే మత్స్యకారులు– మత్స్యకారులే ముదిరాజులు” అనే నినాదంతో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని గురువారo నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ 10 సంవత్సరాల కిందట ఆవిర్భవించి నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావం నాటి నుండి నేటి వరకు ఆనాటి ప్రభుత్వాన్ని మెప్పించి, ఒప్పించి మత్సకారుల జీవితాలో గణనీయ మార్పులు తీసుకొని వచ్చిన “సంఘం” అని ఆయన వివరించారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ మాత్రమే ప్రతీ ముదిరాజ్ గుండెను తాగిందన్నారు. గత 68 సంవత్సరాలకు భిన్నంగా 10 సంవత్సరాల కాలంలో సాధించినవి, సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందన్నారు. అందు కోసం తెలంగాణ ముదిరాజ్ మహాసభ జెండాను ప్రతీ గ్రామంలో ఎగుర వేశామన్నారు. గ్రామంలో, పట్టణంలో, జిల్లా మండల కేంద్రంలో ముదిరాజ్ జెండా ఎగర వేసి ర్యాలీలు సంబరాలు జరిపామన్నారు. ప్రతీ ముదిరాజ్ కుటుంబానికి చెందిన అర్హత ఉన్న వ్యక్తికి మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యత్వం కల్పించాలని కోరారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ దశాబ్ది ఉత్సవాలు, ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన మండల అధ్యక్షులకు గ్రామ అధ్యక్షులకు అభినందనలు తెలిపారు.

Exit mobile version