*ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలి
కరీంనగర్ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు చేలుపూరి రాము*
*ఇల్లంతకుంట డిసెంబర్ 3 ప్రశ్న ఆయుధం*
సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం) ఆధ్వర్యంలో డిసెంబర్ 4న ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని చెల్పూరి రాము పేర్కొన్నారు మంగళవారం రోజున ఇల్లందకుంటలో తెలంగాణ రైతు సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము మాట్లాడుతూ సయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం) ఆధ్వర్యంలో రేపు బుధవారం రోజున ఇందిరాపార్క్ దగ్గర జరగబోయే ధర్నా కార్యక్రమాన్ని ఇల్లందకుంట మండలం కరీంనగర్ జిల్లాలోని, వివిధ మండలం గ్రామాల నుండి కౌలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కౌలు రైతులకు పిలుపునిచ్చారు.2011 చట్టం ప్రకారం కౌలు రైతులకు లోన్ ఎలిజబుల్ కార్డులు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కౌలు రైతులకు రైతు భరోసా, రైతు భీమా, పంటల భీమా, రుణ సౌకర్యం, రుణమాఫీ కల్పించాలని తెలంగాణ రైతు సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ పేర్కొంది