Site icon PRASHNA AYUDHAM

హరే రామ హరే కృష్ణ పౌండేషన్ కి ఇచ్చే ప్రతిపాదన విరమించుకోవాలి

IMG 20240813 WA0897

హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్కు ఇచ్చే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి.

సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్

సిద్దిపేట ఆగస్టు 13 ప్రశ్న ఆయుధం :

మధ్యాహ్న భోజన పథకాన్ని హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కి ఇచ్చే ప్రతిపాదన వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు సిద్దిపేట జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం రోజున సిద్దిపేట అర్బన్, రూరల్ మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా అక్కడికి వచ్చిన డిఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం చొప్పరి రవికుమార్ మాట్లాడుతూ 2024 జూన్ 27న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో సమావేశమై సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు అధ్యయనం చేయాలని సూచించారు. ఇప్పటికే కొడంగల్ లో సెమి రెసిడెన్షియల్ పైలెట్ ప్రాజెక్టు పనులు ప్రారంభమైనాయి రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు అధ్యయనం చేయాలని సూచించారు. ఇది సరైనది కాదు ఈ ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 54,202 మంది మధ్యాహ్న భోజన కార్మికులు గత 24 సంవత్సరాలుగా అనేక కష్టా, నష్టాలకు ఓర్చి పనిచేస్తున్నారు. పనిచేసే వారిలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు చెందిన మహిళలు వీరి ఉపాధిని పరిగణలోకి తీసుకోకుండా మొత్తం పథకం నిర్వహణను హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్కి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నిర్ణయం అమలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉంది. కార్మికులకు సకాలంలో బిల్లులు రాకపోయినా అప్పులు చేసి పిల్లలకి వండి పెట్టి అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా ప్రభుత్వం ఏదో ఒక రోజు ఆలోచిస్తది అనేటటువంటి నమ్మకంతో కార్మికులంతా పనిచేస్తున్నారు. ఒక పక్క ఆకాశాన్ని అంటుతున్న ధరలు, మరోపక్క పిల్లలకి ఇచ్చే మెనూ చార్జీలు కార్మికులకు ఇచ్చే వేతనం నెలల తరబడి పెండింగ్లో ఉంది. అయినా ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త స్కీము ప్రభుత్వం మా గురించి ఆలోచిస్తాది అనేటటువంటి విశ్వాసంతో కార్మికులందరూ ఉన్నారు. మూలికే నక్కపై తాటిపండు పడ్డట్లుగా కార్మికులకు అన్యాయం చేస్తు కేంద్రీకృత వంటశాలలు తీసుకొచ్చి కార్మికుల పొట్టలు కొట్టేటటువంటి నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ఆలోచన వినిపించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మామిడాల కనకయ్య యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బెల్లి రాజమణి, కార్మికులు కిష్టవ కిష్టవ్వ, లింగవ్వ, స్వప్న, స్వరూప, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version