టెండర్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు అస్పగించాలనే ప్రతిపాదనను విరమించుకోవాలి.
బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించి నిధులు దుర్వినియోగం కాకుండా కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలి.
సిద్దిపేట జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పర రవికుమార్.
సిద్దిపేట ఆగస్టు 30 ప్రశ్న ఆయుధం :
తెలంగాణ భవన నిర్మాణం వెల్ఫేర్ పోర్టులో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టెండర్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలన్న ప్రతిపాదనను సిద్దిపేట జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి రవికుమార్ డిమాండ్ శుక్రవారం రోజున సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 లక్షల మందికి పైగా భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు 54 వృత్తుల్లో పనులు చేస్తున్నారు. వీరంతా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన అట్టడుగు వర్గాలకు చెందిన పేదలు. తెలంగాణ రాష్ట్రంలో 2007లో వెల్ఫేర్ బోర్డును ప్రకటించి 2009 నుండి భవన నిర్మాణ కార్మికులకు 11 రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూ.6,30,000/-లు, సహజ మరణం చెందిన కార్మికులకు రూ.1,30,000/-లు, వివాహ, ప్రసూతి కానుకగా రూ.30,000/-ల చొప్పున, గాయాలపాలైన సందర్భంలో నష్టపరిహారాలు అందజేస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలు కార్మికుల కుటుంబాలకు రక్షణగా ఉన్నాయి. ఇంకా కేంద్ర చట్టంలో ఉన్న పెన్షన్, పిల్లలకు స్కాలర్షిప్స్, గృహ వసతి, అడ్డాలలో మౌలిక సౌకర్యాలు వంటి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు కావడం లేదు. రాష్ట్రంలో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసిన నాటి పథకాలే నేటికీ కొనసాగుతున్నాయి. కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలో, ఉన్న సంక్షేమ పథకాలకు నిధులు పెంచడంలో గత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మిక సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా, నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్ళించి వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించకుండా ఇష్టారాజ్యంగా దుబారా చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చింది. కార్మికులకు కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని ఆశించిన కార్మికులను నిరాశపర్చింది. ప్రస్తుతం ఇస్తున్న సంక్షేమ పథకాలు కూడా కార్మికులకు అందకుండా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చి బాధ్యత నుండి తప్పుకోవాలని చూస్తున్నది. భవన నిర్మాణ కార్మికులతో సంబంధం లేనటువంటి గిగ్ వర్కర్స్ 10,000 మందిని కూడా భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డులో మెర్జ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటే 15.9 లక్షల మందిని మాత్రమే రెన్యువల్ చేసి మిగతా 10 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తించకుండా వారికి అన్యాయం చేస్తున్నది. టెండర్ పాడుకున్న ఇన్సూరెన్స్ కంపెనీలు చిన్న చిన్న కారణాలు చూపి కార్మికులకు నష్టపరిహారాలు అందకుండా చేసే ప్రమాదం ఉంది. ఇలాంటి కొత్త ప్రతిపాదనలు తీసుకువచ్చే ముందు కార్మిక సంఘాల నాయకులతో, మేధావులతో అనుభవం కలిగిన నిపుణులతో చర్చించి మాత్రమే అమల్లోకి తీసుకురావాలి. ప్రభుత్వం హడావిడిగా టెండర్లకు పిలిచి వెల్ఫేర్ బోర్డు నిధులను ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టే ఆలోచనలు విరమించుకోవాలని, 1996 చట్టం ప్రకారం వెల్ఫేర్ బోర్డు ద్వారానే నిధులను కార్మికులకు అందించాలని కోరుతున్నాం. లేనిపక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని అన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో యూనియన్ నాయకులు సురేష్, అంతయ్య, బాబు, రామచంద్రం, రాములు, నారాయణ, రాజయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.