సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెకు పిఆర్ టియు శాఖ సంపూర్ణ మద్దతు
–పిఆర్ టియు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు అంబీర్ మనోహర్ రావు
ప్రశ్న ఆయుధం, డిసెంబర్ 19, కామారెడ్డి :
కామారెడ్డి పట్టణ మున్సిపల్ కార్యాలయం ముందర తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెకు పిఆర్ టియు తెలంగాణ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు అంబీర్ మనోహర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మీరాజంలు హాజరై సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్ లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, వారికి రెగ్యులర్ స్కేల్ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కేజీబీవి సిబ్బంది సమ్మెలో ఉండడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని, కాబట్టి ప్రభుత్వం తొందరగా స్పందించి వారి డిమాండ్స్ నెరవేర్చాలని కోరారు.