రైల్వే అండర్ గ్రౌండ్ లో నీరుని వెంటనే తొలగించి గోతులు కప్పి గిరిజన ప్రజల ప్రాణాలు కాపాడాలి
గుమడ రైల్వే మాస్టర్ శ్రీనివాస్ రావు కి వినతి పత్రం
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 2( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు
వినత పత్రం ఇచ్చిన అనంతరం గుమడరైల్వే స్టేషన్ వద్ద మరియు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నీరు గోతుల్లో మూడు రోజులుగా కురిసిన వర్షానికి బాగా నిండిపోయిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం రైల్వే స్టేషన్ వద్ద మరియు అండర్ బ్రిడ్జి వద్ద నిరసన తెలియజేసిన అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి గిరిజన సంఘం నాయకులు రామకృష్ణ నూకరాజు మాట్లాడుతూ పార్వతిపురం మన్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి నయా మరియుచిన్న్కర్గాల పంచాయతీలకు సంబంధించి 20 గిరిజన గ్రామాలకు ఎంతో ఉపయోగకరమైన కొమరాడ జూనియర్ కాలేజ్ సెంటర్ నుండి ఆయా గ్రామాలకు వెళ్లడానికి రైల్వే అండర్ బ్రిడ్జి నీ ఆనుకొని రహదా సౌకర్యం కలదు ఈ బ్రిడ్జి కింద పెద్ద పెద్ద గోతులు బాగా ఏర్పడటంతో మూడు రోజులు కురిసిన వర్షానికి గాను బాగా ఆ గోతుల్లో నీరు చేరడంతో అనేకమంది వాహనదారులు పడిపోని ముగ్గురికి తీవ్రమైన గాయాలు కూడా నిన్న అనగా గురువారం ఏర్పడిందని కాబట్టి ఇలాంటి సందర్భంలో వెంటనే ఈ అండర్ బ్రిడ్జి కింద నీరు ను పూర్తి స్థాయిలో తొలగించాలని అలాగే ఆ బ్రిడ్జి కింద ఉన్న చిన్న చిన్న గోతులను పూర్తిచేసి అటువైపు వెళ్తున్న 20 గిరిజన గ్రామాల ప్రజలకు అన్ని విధాలుగా భరోసా కల్పించాలని కోరుతూ గుమడ రైల్వే మాస్టర్ శ్రీనివాసరావు కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది వెంటనే ఈ సమస్య పరిష్కరించకపోతే మే 10వ తేదీ దాటిన తర్వాత పెద్ద ఎత్తున గిరిజన ప్రజలతో మరియు ప్రయాణికులతో కలిసి గుమడ రైల్వే స్టేషన్ వద్ద భారీగా ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా రైల్వే శాఖ అధికారులకు తెలియజేయుచున్నాము ఈ కార్యక్రమంలో కొత్తవలస గ్రామానికి చెందిన మరియు వివిధ గ్రామాలకు చెందిన యువకులు పాల్గొన్నారు
గుమడ రైల్వే స్టేషన్ చేసిన వద్ద టేషన్ మాస్టర్ శ్రీనివాసరావు కి వినతిపత్రం ఇస్తున్న ఫోటో అనంతరం రైల్వే స్టేషన్ వద్ద విలేకరులతో మాట్లాడుతున్న ఫోటో మరియు అంతర్ బ్రిడ్జి కింద నీరుని పరిశీలించిన అనంతరం అక్కడ నుండి నాయకులు మాట్లాడుతున్న ఫోటో వీడియో మరియు అండర్ బిడ్డి పక్కన ఆటో పెద్ద గొయ్యిలో దిగిపోవడంతో ఆటోను పక్కకి నెట్టుతున్న గిరిజన యువకులు ఫోటో వీడియో అలాగే అండర్ బ్రిడ్జి లో నీరు ఉండడంతో గోతుల గుండా పెద్ద పెద్ద లారీలు వస్తున్న ఫోటో వీడియో చూడగలరు