Site icon PRASHNA AYUDHAM

వర్షం కురిసె… ధాన్యం తడిసె…!

IMG 20251025 210516

వర్షం కురిసె… ధాన్యం తడిసె…!

ప్రశ్న ఆయుధం, భిక్కనూర్ — అక్టోబర్ 25

భిక్కనూర్ మండలంలో వర్షం రూపంలో ప్రకృతి పంట చేతికొచ్చిన రైతులపై ఆటలాడుతోంది. గత కొద్ది రోజులుగా కష్టపడి పండించిన వరి పంటలు కోత దశలో ఉండగా శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి రైతుల ధాన్యం తడిసిపోయింది.

మండల కేంద్రం తో పాటు పరిసర గ్రామాల్లో కూడా కోత పూర్తయి 10–15 రోజులు గడిచినా ప్రభుత్వం ఇప్పటివరకు వరి కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వడ్లు ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాయని, శ్రమ ఫలితం నీటిలో కలిసిపోతోందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version