ఒక మనిషి సాధారణంగా చనిపోవడం అనేది అసాధ్యమైన ముచ్చట, ఒకవేళ మరెవరి బలవంతం వల్ల కూడా చనిపోవడం అనే ఆలోచన రావడం పట్ల కొంతవరకు బలమైన కారణం కావచ్చు కానీ అది మాత్రమే అంతిమ తీర్పు కాదు. ఒకరి వలన గాయం చేసుకోవడమే మహా కష్టం, అలాంటిది ఈ జీవితాన్ని త్యాగం చేస్తున్నామంటే ఎంత బలమైన కారణం ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని వెనకాల అనేక కారణాలు, సంఘర్షణలు, బలమైన గాయాలు, మానసికంగా కృంగి కృషించి పోవడం వలన చనిపోవడం కోసం మార్గాలు అన్వేషణ సాగిస్తారు. ఏదో రూపకంగా వారి ప్రవర్తన వల్ల కావచ్చు మాటల రూపకంగా కావచ్చు బయట పెట్టాలని చూస్తుంటారు, కానీ వారిని అర్థం చేసుకొని ఆకలింపుగా గమనించే వ్యక్తుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు వారు మాత్రమే వారి ప్రవర్తన తీరులో మార్పులు ప్రస్ఫుటంగా చూడవచ్చు, అందుకు ముందు కూడా వారి భావలతో కొంతమేరకు వ్యక్తీకరణ, చికాకు, కోపం, అసహనం వ్యక్తపరచిన సంఘటన అనేకం ఉంటాయి. కానీ వాటిని అర్థం చేసుకొని వారి ఆలోచన లను ప్రక్కదవ పట్టించకు పట్టించడానికి వారి ప్రవర్తనలో మార్పులు తీసుకురాలేముదీనికి ప్రధానంగా, నాలుగు కారణాలను, శాస్త్రీయపరంగా, సైకాలజికల్ పరంగా పెద్దలు చెప్తున్నారు, వీటిని అవగాహన చేసుకుందాం, ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ 1) అక్రమ సంబంధాలు,2) ఆర్థిక సమస్యలు,3) అనుమానాలు.4) మద్యపానం వ్యసనం. ఇవే కాక చిన్న చిన్న కానాలతో కూడా ఈ మహత్కరమైన శరీరాన్ని బుగ్గిపాలు చేస్తున్నారు. కొన్ని కారణాలు మాత్రం చెప్పరానివి, అమ్మ తిట్టిందని నాన్న కొట్టాడని, భర్త మందలించాడని, భార్య కాపురానికి రాలేదని,పాఠశాలలో ఉపాధ్యాయులు కోపగించుకున్నారని, ఇలాంటివి అనేక కారణాలవల్ల, ఈ మానవ దేహాన్ని అర్థం తరంగా ముగించేస్తున్నారు.1) అక్రమ సంబంధాలు: మనుషులలో పెక్కు సమస్యలు సృష్టిస్తున్నాయి ఈ అక్రమ సంబంధాలే, వావివర్సలు లేని భేదభావం లేకుండా, పేద బీద అనే తారతమ్యాలు లేకుండా అక్రమ సంబంధాలకు లేవు ఏవి అడ్డంకులు అన్నట్లుగా రోజు రోజుకు కొత్త కొత్త కోణాల్లో బట్టబయలైతున్నాయి. ఈ అక్రమ సంబంధాల పరంపర కొనసాగించడానికి అనేక కారణాలు ఉండవచ్చు, ఈ మధ్యకాలంలో వస్తున్న వింత వింత అలవాట్లు, కోరికలు, కొత్త కొత్త పరిచయాలు, సెల్ ఫోన్ల వంటి మధ్య మాల ద్వారా ముక్కు ముఖం తెలియని వారితో ప్రేమ సంబంధాలు కొనసాగించడం, ఇలాంటివి అనేకం మనుషులలో మార్పులు తీసుకొస్తున్నాయి. సామాన్య మానవుల నుంచి సంపన్న కుటుంబ ల వరకు కొనసాగుతున్నాయి. ఇలాంటివి అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.ఇలాంటి సంఘటనలు, ఉదయం టీవీ చూసిన, ఏ న్యూస్ పేపర్ తిప్పి చూసిన ఇలాంటి కథనాలు కోకా కోలాలు. ఒక సంఘటన జరిగిన తర్వాత మార్పులు వస్తాయంటే అది లేదు, అనేక సంఘటనలు పదేపదే జరుగుతున్నాయి, దీనివలన సంఘంలో పేరు ప్రతిష్ఠులు పోవడంతో పాటు. పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ, బంధుమిత్రులతో భంగపాటుకు గురికావడం వలన కూడా మానసిక అశాంతి కోల్పోయి, మరణానికి దారి తీసిన సంఘటనలు మాత్రం అనేకం, ఈ మధ్యకాలంలో భార్యాభర్తల వల్ల ముక్కుపచ్చలారని పసిపిల్లలు సైతం బలి అవుతున్నారు. కొంతనైనా కనికరం లేని మనుషులు, కన్న తల్లిదండ్రులుగా కూడా మర్చిపోయి పసి పిల్లలతో సహా ప్రాణాలు కోల్పోతున్నారు. పాలు తాగే పసిపాపలను సైతం కొంచమైనా మానవత్వం లేకుండా వారి ప్రాణాలను బలి కొంటున్నారు. చిన్నపిల్లలు బలి అయిపోతున్నారు వారిని ఆగం చేసి అక్రమ సంబంధాల వలలో చిక్కుకొని వారి కోరికలు తీర్చుకోవడం కోసం, పసివారిని బలి పశువులు చేస్తున్నారు. వారి అక్రసంబంధాలకు ఎక్కడ అడ్డు తగులుతారు అని, వాళ్ల సంబంధాలు గుట్టు రట్టు అవుతాయని ఈ మరణాలు బలవంతంగా జరుగుతున్నాయి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితం కాగా ఇప్పుడు అంతటా వ్యాప్తి చెందుతున్నాయి. అసలు వీటిని ఎలా అరికట్టాలి అనేది అసలు సమస్య, ఏ వ్యవస్థకు అంత చిక్కని ఈ సమస్యలను పోలీసు వ్యవస్థ సైతం తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇది సరి కావాలంటే వీధికో సైకాలజిస్ట్, ఊరుకో సైకియాట్రిస్ట్ అవసరం అవుతారు. ఇంట్లో భార్యాభర్తల సంబంధం సరిగ్గా లేకపోవడం మూలంగా కావచ్చు, ఒకవేళ అన్ని మంచిగానే ఉన్నప్పటికీ విచ్చలవిడిగా కోరికలు ఎలాగైనా తీర్చుకోవాలని కాంక్ష, నన్ను ఎవరు చూస్తా లేరు, అనుకునే మానసిక ధోరణి, అంతే కాకుండా ప్రతిరోజు కొత్తదనం ఉండాలని కోరుకోవడం, ఉన్నదాంట్లో తృప్తి పడకుండా, ” కామ పురాణం నా భయంతో నా లజ్జ ” అన్నారు పెద్దలు కోరికలు తీర్చుకోవడానికి భయం, సిగ్గు, ధర్మాధర్మ విచక్షణ కోల్పోవడం, శరీర సుఖమే అంతిమంగా అన్ని ఇస్తుందనే భావనలోజీవించడం మూలంగా ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. వీటికి కుటుంబ సభ్యులు సైక్యతగా లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు, మామూలుగా పది ఇంట్లో స్వేచ్ఛ అనేది ఉండాలి కానీ అది మితిమీదే ఇవ్వకుండా ఇవ్వగలిగితే అంతా మంచిగే జరుగుతుంది. లేదంటే అనేక అనర్ధాలకు దారి తీస్తుంది.2) ఆర్థిక సమస్యలు: దాదాపుగా ఈ సమస్యలు అనేది నూటికి 90 శాతం కుటుంబలలో ఆర్థిక సమస్యలు కొట్టుమిట్టాడు తుంటాయి. కుటుంబ పోషణ భారం నుండి, పిల్లల్ని కనిపించేదాకా అనేక ఖర్చుల తో కూడుకున్న సమస్య అయినప్పటికీ ఇది మామూలుగా ప్రతి కుటుంబంలో జరిగే సాధారణ విషయమే, మితిమీరిన ఖర్చులు రోజురోజుకు పెరిగిపోవడం ఒక కారణం కావచ్చు, కానీ ఇదే అంతిమ సమస్య కాదు అని అర్థం చేసుకోవాలి. భార్యాభర్తల మధ్య ఈ అగాధం పూచలేక అనేక సమస్యలు కొని తెచ్చుకోవడం జరుగుతుంది. ఉన్నదాంట్లో పొదుపు చేయలేక అందరి వద్ద అప్పు చేసి సంసారాన్ని నెట్టుకు రాలేక కుటుంబ యజమాని భార్య పిల్లల్ని నిర్లక్ష్యం చేయడం మూలంగా, భార్య, లేదా భర్త, వేరే పని చేసే చోటునో లేదా అధికంగా డబ్బులు సంపాదించాలని కోరిక కావచ్చు, విలాసవంతమైన జీవితం గడపడం కోసం కావచ్చు, ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు కొట్టుమిట్టాడుతాయి. అదనపు సంపాదన కోసం చేయరా నీ పనులు చేస్తూ అనవసరంగా ప్రాణాలు మీదికి కొని తెచ్చుకుంటున్నారు. ఇది దాదాపుగా చాలా చోట్ల జరుగుతూనే ఉంటుంది. మనం అనేకం చూస్తూనే ఉన్నాం. ఇది ఎవరి స్థాయికి మించి వారి వారి స్థితిగతులను మించి చేయడం మూలంగా, అంగులు, ఆర్భాటాలు చేసి అనవసర ఖర్చులు చేయడం మూలంగా, ఆర్థిక సమస్యలు పెరిగిపోయి అవి ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి. 3) అనుమానాలు: ఒక్కసారి ఒక మనిషికి అనుమానం అనే బీజం మొలకెత్తింది అంటే అదే పెద్ద పెనుభూతమై ఆ మనుషులను కాలరాస్తుంది కడ తేర్చుతుంది. ఏ చిన్న పొరపాటు జరిగిన అనుమానించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అందులో భార్యాభర్తల బంధం కావచ్చు , ప్రేమ వ్యవహారాల కావచ్చు, మనుషులకు అనుమానం ఎదురుకోవడం అనేది పెద్ద సవాలుగా మారింది. మంచిగా జీవించిన అన్ని రోజులు ఏ సమస్యలు రావు, నిజంగానే తప్పు చేసిన అనుమానం లేనప్పుడు అది పెద్ద సమస్యగా మారదు, కానీ అదే అనుమానం మొదలైనప్పుడు అనుక్షణం నరకంగానే మారుతుంది. అనుమానం అంకురించడం మొదలైతే,అది మనిషిని మనిషిగా ఉండనివ్వదు. రాక్షసుల్లా మార్చేస్తుంది. దీనికి ఏ మందులు కూడా పనిచేయవు, వినలేని పరిస్థితి, అసలు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. లోపాలు లేని మనిషి లోకంలో ఎవరు ఉండరు కానీ ఒక్కసారి లోపం ఏర్పడితే ఆ పరిస్థితి దారుణంగా ఉంటుంది. లోలోపల మదనపడి మానసికంగా కృంగి కృషించి పోవడమా? అంతిమంగా ఆత్మహత్య చేసుకోవడమా అనేది సంఘర్షణకు దారితీస్తుంది. పదేపదే భార్యాభర్తల మధ్య తవ్వులాటలు మొదలై మాటిమాటికి చిన్నపిల్లల మధ్య చికాకు పడడం కోపగించుకోవడం, కొట్టడం, జరుగుతాయిజరుగు తుంటాయి. భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు మొదలైంది మరణాల దాకా దారి తీస్తుంది. ఈ అనుమానాలను ఆదిలోనే తెంచి వేయాలి, అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎవరైనా అనుమానం కలిగినప్పుడు, ముఖాముఖిగా అడిగి తెలుసుకోవాలి, ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని నిలదీయడం అంత మంచిది కాదు, ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఇలా ముఖాముఖి అడగడం చేతకాకపోతే, లెటర్ రాయడమా, వాట్సాప్ లో మెసేజ్ చేయడమా, ఇదేదీ సాధ్యం కాకపోతే, కుటుంబ పెద్దలతో చర్చించడమా, అలా కూడా సాధ్యం కాకపోతే, బంధుమిత్రుల సహకారం తీసుకొని సమస్యను పరిష్కరించుకోవాలి కానీ మరణానికి అనుమానం కారణం కాకూడదు. ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలే అనుకునేవారు, దానిని పదే పదే వాయిదా వేయాలి, లేదా ఏదో రూపంలో దాటవేయాలి, తన మనసుకు పదేపదే సర్ది చెప్పుకోవాలి, దీనిని కొంతవరకు జయించవచ్చు.4) మద్యపాన వ్యసనం : ప్రతి మనిషికి ఏదో ఒక వ్యసనం కలిగి ఉంటాడు.అది అలవాటే అనుకోవచ్చు, దినచర్య కావచ్చు, జీవితమన్నాక ఏదో కొన్ని షరతులు లేని కోరికలు తీర్చుకోవడం కోసం మనిషి అనేక పొరపాట్లు చేస్తూ ఉంటాడు, అందులో ఈ మధ్యపానం కూడా ఒక వ్యసనంలా మారుతుంది. డ్రగ్స్ మొదలుకొని కల్లు సీసలదాకా కొనసాగుతూనే ఉంటుంది. గంజాయి నుండి చుట్టవరకు, ఈ బంధం చుట్టుకునే ఉంటుంది. ఈ మధ్యపానం అనేది అనేక కుటుంబాలలో చిచ్చు లేపడానికి ప్రధాన కారణం. ప్రతి మనిషి ఒకటి మర్చిపోవడానికి మరొక వ్యసనంతో సంబంధాలు పెట్టుకుంటాడు.అది మనుషులతో కావచ్చు, మరే మత్తుమందులతో కావచ్చు, అతని జ్ఞాపకాలను మర్చిపోవడానికి,బాధలు దూరం చేసుకోవడానికి కావచ్చు, మద్యమాన్ని ఒక కవచకంగా వాడుకుంటాడు, అది అంతిమ పరిష్కారాన్ని ఇవ్వకపోవచ్చు కానీ, దీనివలన మాత్రం అనేక కుటుంబాల్లో విపరీతమైన సమస్యలు తెచ్చి పెడుతుంది. కాలానుగుణంగా జరుగుతున్న పొరపాట్లు,ఇంట్లో సమస్యలు, వ్యవహారంలో సమస్యలు కావచ్చు, ఉద్యోగరీత్య వ్యాపార రీత్యా అనేక రకాల ఒత్తిడిని తట్టుకోవడానికి, ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో పాఠశాలకు పోయే విద్యార్థుల నుండి పండు ముసలి వరకు మధ్యమాని సేవించిన వారు ఉండరంటే అతిశక్తి కాదు, ఒత్తిడిని తట్టుకోవడానికి ఎంచుకునే ఒక మార్గం ఈ మధ్యపానం వ్యసనం, దీనినీ అధిగమించడానికి అనేక మార్గాలు ఉన్నాయి అయినప్పటికీ, మనిషి సులువుగా ఏది లభిస్తే దానిని ఆయుధంగా వాడుకుంటాడు, అలాంటి యొక్క సాధనమే ఈ మధ్యపానం. మనిషికి సహజంగా ఇంద్రియాల సుఖం పైన ఆసక్తి కనబరుస్తాడు కాబట్టి యోగా, ధ్యానం, సమాధి లాంటి ఆసనాలు అనేకం ఉన్నాయన సంగతి తెలిసి కూడా పాటించడం లేదు. ఉన్నదాంట్లో తృప్తి పడని జీవితాలు అనేకం, వేసన్న పరులుగా మారి అందమైన కుటుంబాలను, వీదిల పాలు చేస్తున్నారు. బంగారం లాంటి భవిష్యత్తును, అంరకారం లోకి నెట్టేస్తున్నారు బలవంతంగా, ఎంతోమంది సైకాలజిస్ట్ లో ఉన్నారు, కౌన్సెలింగ్, సెంటర్లు ఉన్నాయి. మఠలు,పీఠాధిపతులు గురువులు, స్వామీజీలు, ఊర్లలో పెద్ద మనుషులు, పోలీస్ స్టేషన్లో మనసుంటే మార్గం దొరుకుతుంది ఏదో ఒక చోటు, మన ప్రయత్నం లేకుండా ఏదీ కూడా జరగదు. కాబట్టి జీవించాలనే తలంపు బలంగా ఉండాలి కానీ ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ, కారణాలు లేకుండా ముందుకు సాగవచ్చు, అనవసరంగా ఆలోచించి భగవంతుడు ఇచ్చిన ఈ ప్రాణాలను బలవంతంగా తిరస్కరించకూడదు. మళ్లీ నీకు జన్మ వస్తుందో రాదో ఎవరికి తెలియదు, వచ్చిన జీవితాన్ని సద్వినియం చేసుకొని చేతనైతే పరులకు సహాయం చెయీ, లేకపోతే వారి సహాయం తీసుకో అంతేగాని బలవంతంగా చావును మాత్రం కొని తెచ్చుకోకూడదు. అంతిమంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంది, అనవసరంగా కుటుంబాలను చిన్న పిల్లలను నాశనం చేయకూడదు, ముందు తరాల వారికి మనం మార్గం చూపించాలి, అంతేకానీ వారిచే చి అనిపించుకోకుండా ఉండాలి , ఈ బ్రతుకు అర్థం పరమార్థం వెతుకుంటే, ఎవరో ఒకరు నీకు సాయం చేయకపోరు.
……… మీ తుమ్మ కృష్ణ, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు. 83746 66327