పేద ప్రజలకు వందేళ్లుగా ఎర్ర జెండానే భరోసా

.

 

కొత్తగూడెం నియోజకవర్గాన్ని సమగ్రంగా అభిరుద్ది చేసుకుందాం.

నియోజకవర్గ రైతుల సాగునీటి కస్టాలు తీర్చేందుకు సీతారామ నీళ్లను మళ్లించేందుకు కృషి.

కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.

ఉమ్మడి పెనగడప పంచాయతీ నుంచి 120కుటుంబాలు సిపిఐలో చేరిక.

కొత్తగూడెం/చుంచుపల్లి: కార్మికులకు, కర్షకులకు, పేదవర్గాల ఎర్ర జెండానే భరోసాగా నిలుస్తోందని, వందేళ్లుగా ప్రజలపక్షం వహిస్తూ బలమైన రాజకీయ శక్తిగా సిపిఐ నిలబడిందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పునరుద్గాటించారు. చుంచుపల్లి మండలం, ఉమ్మడి పెనగడప గ్రామపంచాయతి పరిధిలోని పెనగడప గ్రామంలో ఆదివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశం సందర్బంగా మన్నెం వెంకన్నా, పఠాన్ ఖాసీం ఖాన్, అలీం, తాజుద్దీన్, రహీం జానీ, కుంచం శ్రీనివాస్, ఆదిమూలం శ్రీను, కుంచం మల్లయ్య, గోపాల్, బరగడి నాగరాజు, బరగడి సాగర్, ఓడపల్లి ధర్మయ్య, కృష్ణవేణి, గొగ్గెల వీరభద్రం, పూనెం నాగరాజు, తగరపు రవి, బి రవి, నవీన్, శ్రీనివాస్, మన్నెం భాస్కర్, రఘు తదితరుల నేతృత్వంలో వివిధ గ్రామాల నుంచి 120 కుటుంబాలు కూనంనేని, సాబీర్ పాషా సమక్షంలో సిపిఐలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సభలో కూనంనేని మాట్లాడుతూ గడిచిన ఎనిమిది నెలల కాలంలో మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధి లక్ష్యంతో అహర్నిశలు శ్రమిస్తున్నామన్నారు. ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి శాశ్వత పరిస్కారంకోసం కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రజల మౌలిక అవసరాలైన త్రాగు నీరు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సౌకర్యం, మెరుగైన ప్రభుత్వ వైద్యం కల్పించేందుకు ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇప్పటికే గెలుపుఫలాలు ప్రజల దరిచేర్చామని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామన్నారు. నియోజకవర్గ రైతుల సాగునీటి సమస్యపై ప్రత్యేక ద్రుష్టి సారించానని, సీతారామ ప్రాజెక్టు నీటిని నియోజకవర్గానికి మళ్లించేందుకు ప్రతుత్వంపై వత్తిడి తెస్తున్నానని, త్వరలో నియోజకవర్గ రైతాంగానికి నీటి సమస్య తీరనుందన్నారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు ప్రజాసంఘాల్లో బాధ్యతలు చేపట్టి పార్టీ విస్తరణకు కృషిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, మండల కార్యదర్శి, జిల్లా సమితి సభ్యులు వాసిరెడ్డి మురళి, జి వీరాస్వామి, బొర్ర కేశవరావు, నాయకులు తోట రాజు, నీడాల సుధాకర్, మన్నే భద్దరరావు, కట్టా పుల్లయ్య, కట్టా ఉదయ్, రామకృష్ణ, రాజు, సాయి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now