గ్రంథాలయ చైర్మన్ ను కలిసిన తెరవే ప్రతినిధులు

గ్రంథాలయ చైర్మన్ ను కలిసిన తెరవే ప్రతినిధులు

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 5

 

కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డిని, శనివారం కామారెడ్డి తెరవే ప్రతినిధులు కలిసి శాలువా తో సన్మానించి, తమ రచనల పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా తె ర వే జిల్లా అధ్యక్షులు గఫూర్, శిక్షక్ జిల్లా సాహిత్యానికి సంబంధించి పుస్తకాలను, భద్రపరిచేందుకు ప్రత్యేకంగా గ్రంథాలయంలో చోటును కల్పించాలని, కవుల రచనలను వివిధ గ్రంథాలయాలకు పంపించే ఏర్పాటు చేయాలని,కోరగా తప్పకుండా ఏర్పాటు చేస్తానని

జిల్లా సాహిత్య అభివృద్ధికి కవుల రచనలకు ఎల్లవేళల సహకరిస్తానని, చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి అన్నారు.

కామారెడ్డి సాహిత్య వాతావరణాన్ని కవులు రచయితలను గురించి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి జిల్లా సాహిత్యం ఎంతో గొప్పదని సాహితీ వేత్తల కృషి అభినందనీయమని, మరింత సాహితీ కృషిచేసి జిల్లాను సాహితీ రంగంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ

కార్యక్రమంలో తెరవే ప్రతినిధులు తమ పుస్తకాలను చైర్మన్ కు అందించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయితల వేదిక జిల్లా ఉపాధ్యక్షులు మంద పీతాంబర్, నాగభూషణం, కాసర్ల రామచంద్రం, పాటల రచయిత కౌడి రవీందర్, తిరుపతిరావు, సింగర్ సంధ్య , బానోత్ సురేష్, లక్కీ భాస్కర్,

తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment