బాలల పై లైంగిక దాడులను రక్షించే బాధ్యత సమాజంలో ప్రతి ఒక్క పౌరుని బాధ్యత
అప్స స్వచ్చంద సంస్థ మరియు యూనిసెఫ్ ,ఆశ్రిత లాంటి స్వచ్చంద సంస్థలు బ్లూ అంబ్రెల్లా డే ర్యాలీ నిర్వహించడం అభినందనీయం
నార్త్ జోన్ అడిషినల్ డిప్యూటీ కమిషనర్ అఫ్ పోలీస్ డాక్టర్ సి అశోక్
ప్రశ్న ఆయుధం : అప్స స్వచ్చంద సంస్థ మరియు యూనిసెఫ్ సంస్థ సహకారం తో ఐక్యరాజ్య సమతి ఆదేశాలతో అంతర్జాతీయ బాయ్స్ బ్లూ అంబ్రెల్లా 100 బాలలతో నార్త్ జోన్ డిప్యూటీ కమిషనర్ అఫ్ పోలీస్ డాక్టర్ సి అశోక్ చేతుల మీదుగా స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు బాలలతో మరియు అధికారులు జూబ్లీ బస్సు స్టేషన్ ముందుగా ఉన్న పార్క్ నుండి నార్త్ జోన్ డిప్యూటీ కమీషనర్ అఫ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది డిప్యూటీ కమిషనర్ పోలీస్ ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ అశోక్ మాట్లాడుతూ నేటి సమాజాల్లో బాలలపై 52 శాతం లైంగిక మరియు మానసిక శారీరక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి అని వీటిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు దాడులకు గురి ఐనవారు తమకు జరిగిన అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకు వచ్చినప్పుడే వారికి నిజమైన న్యాయం అందుతుంది మౌనాన్ని వీడండి నోరు విప్పి మాట్లాడండి అని పిలుపునివ్వడం జరిగింది.
అనంతరము యూనిసెఫ్ అప్స స్వచ్ఛంద సంస్థ మరియి ఆశ్రీత స్వచ్చంద సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ అబ్బాయిలు వేధింపులకు గురికాకుండా చూడాలి మాట్లాడి సహాయం తీసుకోవాలి అబ్బాయిలను రక్షించడం మన అందరి బాధ్యత రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తి సురక్షితమైన మరియు ఆరోగ్యమైన బాల్యాన్ని పొందే హక్కు ఉంది దానికి మన అందరి బాధ్యత మీ హక్కులు మీ విలువలు తెలుకోండి మీరు ఒంటరివారు కారు సమాజం, అండగా ఉన్నారు అబ్బాయిలు సురక్షితమైన వాతావరణం మనతోనే మొదలు అవుతుంది మీరు తప్పులు చేయకుండా మీరు నిందించ పడరాదు అబ్బాయిలు లైంగిక శారీరక వేధిపుల నుండి మనమందరం రక్షించే బాధ్యత మనది చాలామంది లైంగిక వేధిపులకు గురవుతున్నారు వారు కోలుకోవడానికి మనమందరం సహకారం అందిస్తాము కృరమైన కార్యకలాపాల బారిన పడకుండా నేటి యువత జీవితాలు కాపాడుదాము అంటూ స్వచ్చంద ప్రతినిధులు మరియు సామజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలతో ర్యాలీ నిర్వహించడం జరిగినది అనంతరం ఈ కార్యక్రమానికి పాల్గొన్న ప్రతినిధులు మరియు బాలలు తమ కార్యక్రమం బ్యానర్ పై సంతకాలతో మద్దతు పలికారు స్వచ్చంద సంస్థలు ఈలాటి కార్యక్రమాలు చేయడం అప్స స్వచ్చంద కార్యకర్తలకు మరియు యునిసెఫ్ బృందానికి అభినందనలు అన్నారు ఈ కార్యక్రమానికి మారేడుపల్లి సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ యూనిసెఫ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డేవిడ్ రాజ్ అప్స సీనియర్ కోఆర్డినేటర్స్ బస్వారాజ్ రమేష్ బుగ్గయ్య ఆశ్రిత సెక్రటరీ నాగరాజ్ డీసీపీఓ అధికారి శ్రీనివాస్ వారి బృందం విజయ భాస్కర్ అప్స స్వచ్ఛంద సంస్థ సహాయ కోఆర్డినేటర్స్ రాజేశ్వరి శోభ లావణ్య శ్రావణి మంజుల ఇందిరా మల్లిక మరియు వివిధ బస్తీల బాలలు సుమారు 100 మంది పైన పాలుగోన్నారు.