వర్షాలతో దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలి
— పాల్వంచ మండలంలో రోడ్డు మరమ్మత్తులను పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 23
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ పాల్వంచ మండలంలోని పిడబ్ల్యుడి రోడ్డు నుండి మంథని–దేవునిపల్లి వరకు జరుగుతున్న మరమ్మత్తు పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అవసరమైన నిధులను ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిందని తెలిపారు.
ప్రభుత్వ లక్ష్యం ప్రకారం సకాలంలో రోడ్లను పునరుద్ధరించి ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకుండా చూడాలని పంచాయతీ రాజ్ ఈఈ దుర్గాప్రసాద్‌ను ఆదేశించారు.
ఈ పరిశీలనలో పాల్వంచ తహసిల్దార్ హిమబిందు, మండల అభివృద్ధి అధికారి కే. శ్రీనివాస్, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ స్వామి దాస్, ఏఈఈ సంజయ్ తదితరులు పాల్గొన్నారు.