లంబాడిల ఐక్య పోరాటంతో దిగివచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం..

*కొడంగల్ లో లగచర్ల రోటిబండ తండా ఫార్మసిటీ భూసేకరణ రద్దు*

*లంబాడిల ఐక్య పోరాటంతో దిగివచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం*…

*లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మూడవత్ రాంబల్ నాయక్*

రేవంత్ రెడ్డి కొమ్ములు వచ్చిన లంబాడి మహిళలు ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని కుట్రలు, కుతంత్రాలతో లంబాడీ రైతులపై అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా జైల్లో వేసి వారు భూములను తీసుకొని ప్రైవేటు ఫార్మా కంపెనీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని రోటిబండ తండా తండా మైసమ్మ గడ్డ తండా తదితర పాండాలకు సంబంధించిన మహిళల అంకితభావం దీక్ష తమ వాదించే మాటలో బలం రేవంత్ రెడ్డి సర్కారును వెనక్కి తగ్గించి ప్రైవేటు ఫార్మా కంపెనీలకు భూములను సేకరించి అంశాన్ని రద్దు చేసుకోవడంతో లంబాడి మహిళల పాత్ర కీలకమని ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి ఉద్యమాభి వందనాలు తెలియజేస్తూ ఏదైనా పోరాడితేనే సాధించుకో గలం అనే నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించిన లంబాడి హక్కుల పోరాట సమితి ఆలోచనతో ఇందులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా మరోసారి లంబాడి హక్కుల పోరాట సమితి ఉద్యమాభిమానాలు తెలియజేస్తూ, 

రెండు వేల ఎకరాల భూసేకరణ జరుగుతున్న ఇప్పటికీ రద్దు చేసింది ఆరువందలపై చిల్లర ఎకరాలు మాత్రమే కనుక మిగిలిన పరిశ్రమ కవాడను సంబంధించిన భూములను కూడా ప్రభుత్వం రద్దు చేయాలని ఆ ప్రాంతంలో ఫార్మసిటీతోపాటు సిమెంట్ పరిశ్రమలు ఇండస్ట్రియల్ పార్కు లాంటివి పెట్టకుండా వేరే ప్రాంతంలో పెట్టాలని మిగిలిన భూములను కూడా రద్దు చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నది,

అక్రమంగా భూసేకరణ పేరుమీద అక్రమ కేసులు పెట్టిన వారిపైన అక్రమ కేసులను ఎత్తివేసి జైలు నుండి విడుదల చేయాలని అదేవిధంగా ఇంకా కొంతమందిపై కేసును పెడతామని భయపెట్టిస్తూ వారిని తండాలని విడిచి హైదరాబాద్ ముంబై పూనా లాంటి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి స్వేచ్ఛగా బతికేటట్టు ప్రభుత్వం ప్రయత్నం చేయాలని పోలీస్ పికెటింగ్లను 144 సెక్షన్ లను ఎత్తివేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నది,

ప్రత్యేక కృతజ్ఞతలు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కి మా లంబాడీల పక్షాన నిలబడి మాకు అండగా ఉంటూ నేనున్నాను అంటూ మా మహిళలకు ధైర్యం చెప్పిన నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు వారి పార్టీ బృందం అందరికీ పేరుపేరునా లంబాడి హక్కుల పోరాట సమితి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది,

లంబాడి హక్కుల పోరాట సమితి భాగస్వామ్యంతో కలిసి వచ్చిన ప్రతి ఒక్క గిరిజన సంఘం సేవాలాల్ సేన గిరిజన విద్యార్థి సంఘం గిరిజన సంఘం ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం అన్ని సంఘాల పక్షాన పోరాటం చేసిన నాయకులకు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా లంబాడి హక్కుల పోరాట సమితి కార్యకర్తలు నాయకులు తమ మద్దతును తెలియజేస్తూ ఈ లంబాడి తండాల భూ రక్షణ పోరాటంలో భాగస్వామ్యలై మీ ప్రాంతంలో ఉద్యమం చేస్తూ రెండు మూడుసార్లు పోలీస్ స్టేషన్లో అరెస్టు అయిన సందర్భంగా మీ నాయకత్వ పట్టినతో ఇంకా ఏ సమస్య వచ్చిన మీ అందరి సహకారంతో సమస్యను పరిష్కరించుకుంటామని ఇలాగే అందరం రాష్ట్రవ్యాప్తంగా ఏ పోరాటం జరిగిన లంబాడీల పక్షాన నిలబడదామని కలబడదామని తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను,

లంబాడి మహిళలు రైతులకు, దళితులకు గిరిజనులకు అండగా నిలబడి అలుపెరగని పోరాటం చేసిన. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులకు, కార్యకర్తలకు, జిల్లా నాయకులకు మండల నాయకులకు గ్రామ నాయకులకు అభినందనలు.. ఈ కార్యక్రమంలో సభావట్ లక్ష్మణ్ నాయక్, వి ,చందు నాయక్, షాద్ నగర్ తాలూకా అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, మోహన్ నాయక్ , బాబురాజ్ నాయక్, రవి నాయక్ , జగన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment