Site icon PRASHNA AYUDHAM

సమాచార హక్కు చట్టం పార్లమెంటు ఆమోదం..ఎం.ఏ. సలీం

IMG 20250823 172223

🔹 సమాచార హక్కు చట్టం పార్లమెంటు ఆమోదం

🔹 ప్రజలకు ప్రభుత్వంపై కళ్ళు పెట్టే హక్కు

🔹 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి — అధికారుల బాధ్యత

🔹 సమాధానం రాకపోతే అప్పీలు — లీగల్ ప్రొవిజన్

🔹 కామారెడ్డిలో అవగాహన కార్యక్రమం ఘనంగా

ప్రశ్న ఆయుధం ఆగష్టు 23కామారెడ్డి:

సమాచార హక్కు చట్టం భారత పార్లమెంటు ఆమోదించిన చట్టమని రాష్ట్ర డైరెక్టర్ ఎం.ఏ. సలీం స్పష్టం చేశారు. శనివారం కామారెడ్డి జిల్లా డ్రైవర్స్ కాలనీలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ఆర్ టి ఐ యాక్ట్ – 2005 పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ –

“ప్రభుత్వ కార్యకలాపాలు పారదర్శకంగా నడవాలి. అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. సమాచార హక్కు చట్టం లక్ష్యం అదే” అని స్పష్టం చేశారు. పౌరులు ఏ ప్రభుత్వ సంస్థ నుంచైనా పత్రాలు, రికార్డులు, ఎలక్ట్రానిక్ డేటా వంటి సమాచారాన్ని అభ్యర్థించవచ్చని తెలిపారు.అభ్యర్థన చేసుకున్న పౌరునికి 30 రోజుల్లో సమాచారం అందించడం ప్రజా అధికారుల చట్టబద్ధ బాధ్యత అని గుర్తు చేశారు. సమాధానం రాకపోతే లేదా అసంతృప్తి కలిగితే అప్పీలేట్ అధికారిని సంప్రదించే అవకాశం ఉందని వివరించారు. భారతీయ పౌరులకే ఈ హక్కు వర్తిస్తుందని స్పష్టం చేశారు.2005 అక్టోబర్ 12 నుంచి దేశవ్యాప్తంగా ఈ చట్టం అమల్లోకి వచ్చిందని చెప్పారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, పరీక్ష ప్యాడ్‌లు అందజేసిన కేతు రమణారెడ్డిని అభినందించారు. ఇటీవల ప్రభుత్వ అవార్డు అందుకున్న నాజియా మస్రత్‌ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర సలహాదారు కేతు రమణారెడ్డి, అడ్వకేట్ ఈక శ్రీనివాస్‌రావు, మోసార్ల శ్రీకాంత్‌రెడ్డి, చారి, జావీద్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version