Site icon PRASHNA AYUDHAM

అల్లరి మూకలు పోలీసులపై బాణాలతో దాడి..

పట్నా: అల్లరి మూకలు పోలీసులపై బాణాలతో దాడి చేయడంతో ఓ మహిళా పోలీసు తలలో బాణం గుచ్చుకొని తీవ్రంగా గాయపడిన ఘటన బీహార్‌లోని అరారియా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అరారియా జిల్లాలోని జోకిహాట్‌ ప్రాంతంలో భూ వివాదం కేసులో కొందరు వ్యక్తులు ఘర్షణ పడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థలాన్ని ఆక్రమించుకున్నవారిని అక్కడి నుంచి పంపించడానికి ప్రయత్నాలు చేశారు. అయితే.. దాదాపు 200 మంది ఉన్న ఆ బృందం బాణాలతో పోలీసులపై దాడికి దిగింది. ఈ క్రమంలో ఓ మహిళా ఎస్సై తలలోకి బాణం దూసుకెళ్లింది. దీంతో పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలిని మహల్‌గావ్ పోలీస్ స్టేషన్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న నుస్రత్ పర్వీన్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ప్రమేయమున్న నిందితుల అరెస్టుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Exit mobile version