గత రెండు సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకోని రోడ్డు..
ప్రశ్న ఆయుధం దోమకొండ, జనవరి 5.
దోమకొండ నుండి కామారెడ్డి వెళ్లే రోడ్డు, , రెండు సంవత్సరాలు కావస్తున్న పూర్తి కాలేదు. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డు నుండి వెళ్లే వారికి, కామారెడ్డి దగ్గర్లో ఉంటది. పాత బస్టాండ్ ఏరియాలో హాస్పిటల్ కి వెళ్లే వాళ్లకు, గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్లే వాళ్లకు కావచ్చు, తొందరగా వెళ్లడానికి వీలుగా గతంలో ఉంటుండేది, ఇప్పుడు తొందరగా వెళ్లడానికి వీలు లేకుండా ఉన్నది. ప్రయాణికులు ఈ రోడ్డు తొందరగా పూర్తి కావాలని కోరుకుంటున్నారు. రోడ్డు తొందరగా పూర్తి అయితే. ఇక్కడ బస్సు సౌకర్యంగా ఉంటది, ఆటోలు నడుస్తాయి, ఎమర్జెన్సీ టైంలో పేషెంట్లను తీసుకెళ్లడానికి ఇబ్బందిగా ఉన్నది కాబట్టి, అధికారులు తొందరగా, రోడ్డును పూర్తి చేయాలని, ముత్యంపేట చింతామణి పల్లి, రాఘవపూర్, దోమకొండ మండల ప్రజలు రోడ్డు తొందరగా పూర్తి కావాలని అధికారులను వేడుకుంటున్నారు.