నకిలీ ధ్రువపత్రాల రాకెట్ బహిరంగం..!!

నకిలీ ధ్రువపత్రాల రాకెట్ బహిరంగం..!!

ప్రసవించింది ఒక్కరైతే, జనన ధ్రువపత్రం మరో పేరుమీద..!

మీసేవలో తప్పుడు దరఖాస్తులు – ఆధార్ నకిలీలతో జనన ధ్రువపత్రాలు

జిజిహెచ్ లో ఒకరి పేరు, ఆఫ్లైన్ లో మరొకరిది – రెండో దశలో తప్పటడుగులు

మున్సిపల్ కంప్యూటర్ ఆపరేటర్ తీరుతో ప్రజల్లో ఆగ్రహం

కలెక్టర్ స్పందించి విచారణ జరిపించాలి – పట్టణ వాసుల డిమాండ్

కామారెడ్డి: పసికందు.. ధ్రువపత్రం.. విక్రయం.. నకిలీ కాగితాల కథలో నిజమెంత..?

కుమ్మరి సాయిలు ఆవేదన…!

కామారెడ్డి జిల్లాలో నకిలీ ధ్రువపత్రాల కలకలం రేగింది. జిజిహెచ్ ఆసుపత్రిలో ప్రసవించిన ఒక మహిళ పేరు మీద కాకుండా మరో దంపతుల పేరుతో జనన ధ్రువపత్రం జారీ అయ్యింది. ఇది సామాన్య తప్పిదం కాదు… స్కెచ్ వేసినట్లు వ్యవహరించిన మీసేవ సిబ్బంది, మున్సిపల్ ఆపరేటర్ వ్యవస్థపై ముద్ర పడుతోంది.

వాస్తవం ఇలా…!!

మార్చి 16న లింగంపేట మండలానికి చెందిన కుమ్మరి మాధవి జిజిహెచ్ లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ ఆమె భర్త కుమ్మరి సాయిలు స్థానంలో బింగి రాజు అని పేరును మీసేవ అప్లికేషన్‌లో వేశారు. ఆధార్ కార్డు సైతం బింగి కవితదిగా అప్లోడ్ చేసి తప్పుడు దరఖాస్తు చేశారు.

ఇంతకీ ఇది ఎలా జరిగిందో అర్థంకాని పరిస్థితి. మున్సిపల్ ఆపరేటర్ గుడ్డిగా ఆ దరఖాస్తును పరిశీలించకుండా జనన ధ్రువీకరణ పత్రం జారీ చేశాడు. తల్లి పేరు మాధవిగా ఉండగా తండ్రి పేరు బింగిగా ఉండటం విచిత్రం.

విశ్లేషణలో బయటపడిన నిజాలు..!!

మాధవి, తన భర్త నుంచి వేరుగా ఉండటం

ఆమె ప్రసవించిన పసికందును ఇతరులకు అప్పగించిన అనుమానం..?

సమాచార హక్కు చట్టం ద్వారా అసలు కథ బయటపడింది.

పసికందు విక్రయానికి పాల్పడ్డారా..? అనేది కీలక ప్రశ్న.

అధికారుల స్పందన లేదు..!!

జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు దీన్ని పట్టించుకోకపోవడం మరింత సంచలనంగా మారింది. “ఫిర్యాదు వస్తే చూస్తాం” అంటూ పక్కకు తప్పుకున్నారు. బాధితుడు మాత్రం న్యాయం కోసం నానాటికీ తిరుగుతున్నాడు.

ప్రజల డిమాండ్ స్పష్టం..!

ఈ మీసేవ కేంద్రంపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకు వారి వద్ద నుండి దరఖాస్తు అయిన అన్ని ధ్రువపత్రాలను ఇంటలిజెన్స్ శాఖ ద్వారా సక్రమంగా దర్యాప్తు చేయాలని, కలెక్టర్ తక్షణం జోక్యం కలగజేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

> స‌మాజంపై నమ్మకంతో ఉన్న ధ్రువపత్రాలే నకిలీగా మారితే, ఎవర్ని నమ్మాలి..?

ఈ వ్యవస్థలో కుడి, ఎడమ చుడకుండా తప్పుడు సర్టిఫికెట్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినవారిపై చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది!

మాధవి భర్త కుమ్మరి సాయిలు ఆవేదన..!!

తాను ఇంట్లో ఉండి వ్యవసాయం ఇతరత్రా పనులు చేసుకుంటూ గుట్టుగా సంసారం చేసుకునే వ్యక్తిని అని అలాంటిది నా భార్య నాకు దూరంగా ఉండి ఒక పాపకు జన్మనిచ్చిందని తెలుసుకొని న్యాయం జరుగుతుందని వెళితే అధికారులు అన్యాయానికే వంత పాడుతున్నారు. ఆ పుట్టిన పాప ఎక్కడుందో ఇంతవరకు తెలియదు. అధికారికంగా మాత్రం బింగిసాయిలు నివాసం తూప్రాన్  అని అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేశారు. సామాన్యునికి న్యాయం జరుగుతుందని ఇప్పటికి నమ్ముతున్నాను ఇప్పటికైనా అధికారులు స్పందించి నకు న్యాయం చేయాలని కోరుతున్నాను.

Join WhatsApp

Join Now

Leave a Comment