తెలంగాణ సాధనలో జానపద కళాకారుల పాత్ర కీలకమైంది
*జానపద కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
*మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ*
*జిల్లా నుండి కళారత్న అవార్డు అందుకున్న రంగసుధాకర్ అలివేలు సమ్మిరెడ్డి*
*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో ఆగస్టు 26*
తెలంగాణ సాధనలో జానపద కళాకారుల పాత్ర కీలకమైందని కళాకారుల ఆట పాటలతో జనాల్లో చైతన్యం తీసుకువచ్చిందని రాష్ట్ర ఏర్పాటులో జానపద కళాకారుల ఎంతో ఉందని మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు హుజురాబాద్ కళారవళి
సోషియో కల్చరల్ అసోసియేషన్ 24 వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జానపద కళోత్సవాలు హుజురాబాద్ లో ఘనంగా ముగిశాయి ముగింపు కార్యక్రమానికి హాజరైన శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ జానపద కళాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తగినచర్యలు తీసుకుంటుందని తెలంగాణ సాంస్కృతిలో జానపదానికి ప్రత్యేక స్థానం ఉందని అన్నారు అనంతరం జానపద కళ రంగంలో రాణించిన 30 మంది నిష్ణాతులకు కళా రవళి సోషియో అసోసియేషన్ ఆధ్వర్యంలో అవార్డులు, ప్రశంసా పత్రాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా అందించి కళాకారులను ఘనంగా సన్మానించారు. అలాగే కరీంనగర్ రంగస్థలం కళాకారుల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రంగ సుధాకర్ అలివేలు సమ్మిరెడ్డి లకు కళా రత్న అవార్డుల ను ప్రధానం చేశారు జానపద కళ ఉత్సవాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు ఆటపాటలు విభిన్న జానపద గీతాలాపన కార్యక్రమాలు చేపట్టారు ఇట్టి కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్ కళా రవళి సోషియో కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు డా. గోపాల్ రావు బాధ్యులు దురై రాజ్ బుర్ర నటరాజ్ సౌకత్ అలి సమ్మయ్య ఇంద్రకరణ్ రాజు కుమార్ రాజ్ కుమార్ ప్రతాప శ్రీనివాస్ కిషన్ రావు నాగభూషణం నారాయణ బండి రమేష్ సుధాకర్ ప్రవీణ్ నారాయణ గౌడ్ శ్రీదేవి లతోపాటు రంగస్థలం నటులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.