ప్రశాంతంగా జరిగిన తొట్టెల ఊరేగింపులో కూకట్పల్లి పోలీసుల పాత్ర ప్రశంసనీయం
మేడ్చల్, జూలై 18 : కూకట్పల్లి నియోజకవర్గంలో బోనాల పండుగను పురస్కరించుకొని ఘనంగా జరిగిన తొట్టెల ఊరేగింపులు ప్రజల ఆధ్యాత్మిక భావాలకు అద్దంపట్టాయి. ఈ సందర్భంగా ప్రజల భద్రతను అందించే విధంగా పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.
ఎస్ఐ రామకృష్ణ నేతృత్వంలో పోలీసు సిబ్బంది పెట్రోలింగ్, ట్రాఫిక్ నియంత్రణ, జనసమూహ నిర్వహణ వంటి చర్యలను సమర్థవంతంగా అమలు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు సంభవించకుండా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. వినూత్నంగా సాగిన బోనాల ఊరేగింపులు, మహిళలు మోసిన తొట్టెల పూజలు భక్తిశ్రద్ధలతో సాగినాయి. ఈ విజయవంతమైన నిర్వహణలో పోలీసుల కృషి పట్ల భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.