మాదకద్రవ్యాల నివారణలో పోలీసుల పాత్ర ప్రాధాన్యం

మాదకద్రవ్యాల నివారణలో పోలీసుల పాత్ర ప్రాధాన్యం

— ఎస్సే పోటీలతో అవగాహన కార్యక్రమం – దోమకొండలో నిర్వహణ

— యువత భవిష్యత్తు రక్షణలో పోలీసులు ముందంజలో ఉండాలి

దోమకొండ, అక్టోబర్ 23 (ప్రశ్న ఆయుధం):

పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో “మాదకద్రవ్యాలు నివారణలో పోలీసుల పాత్ర – విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు” అనే అంశంపై ఎస్సే రైటింగ్ పోటీని నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని దోమకొండ ఎస్‌ఐ. డి. స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించగా, విద్యార్థుల్లో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పిస్తూ, వాటి వల్ల కలిగే దుష్పరిణామాలు, కుటుంబం మరియు సమాజంపై వాటి ప్రభావాన్ని వివరించారు.

ఎస్‌ఐ మాట్లాడుతూ – “మాదకద్రవ్యాలు ఒకసారి అలవాటు అయితే జీవితాన్ని నాశనం చేస్తాయి. యువత ఈ ముప్పును గుర్తించి దూరంగా ఉండాలి. పోలీసులతో పాటు విద్యార్థులు కూడా సమాజంలో అవగాహన కల్పించే పాత్ర పోషించాలి” అని అన్నారు.

ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment