పట్టింపు లేని ప్రత్యేక అధికారుల పాలన
-శివార్ వెంకటాపూర్ గ్రామంలో కంపు కొడుతున్న డ్రైనేజీ
-అవస్థలు పడుతున్న కాలనీవాసులు
తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పదవి కాలం ముగియగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది.పట్టింపులేనట్టు ప్రత్యేక అధికారుల పాలనతో గ్రామాల్లో మురికి కాలువలు,డ్రైనేజీ శుభ్రపరచక కంపు కొడుతున్నాయి అనటానికి మర్కూక్ మండలంలోని శివార్ వేంకటాపూర్ గ్రామాన్ని చూడొచ్చు.మురికి కాలువల డ్రైనేజీ పరిస్థితి అధ్వానంగా తయారయింది.మురికి డ్రైనేజీ కాలువలు శుభ్రపరచక అపరిశుభ్రతతో,కంపు కొడుతున్న మురికితో కాలనీ వాసులంతా అవస్థలు ఎదుర్కొంటున్నామని శివార్ వెంకటాపూర్ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మురికి కాలువల శుభ్రత పట్ల గ్రామ కార్యదర్శికి,గ్రామ ప్రత్యేక అధికారికి తెలియజేసిన పట్టించుకోవడంలేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామ ప్రజల అవస్థలు పట్టించుకునే అధికారులు లేరని ఆ గ్రామ ప్రజల్లో ఆవేద వ్యక్తం అవుతుంది.ప్రత్యేక అధికారుల పాలన గ్రామ ప్రజలకు శాపంగా మారిందని గ్రామ శుభ్రత పట్ల ఏమాత్రం పట్టించుకోవడంలేదని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.ఎప్పటికైనా అపరిశుభ్రతతో కంపు కొడుతున్న మురికి కాలువల పట్ల సంబంధిత ఉన్నత అధికారులు వెంటనే స్పందించి ప్రజలు అనారోగ్యనికి గురి కాకుండా చూడాలని ఆ గ్రామస్తులు ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు.