ప్రపంచం లో పాలకవర్గాలు కార్మిక వర్గంపై దాడులు చేస్తున్నాయి
సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
ప్రజా భాగస్వామ్యంతోనే ప్రైవేటీకరణను నియంత్రించవచ్చు.
ఈ ఈ ఎఫ్ ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సుదీప్ దత్
ఘనంగా ప్రారంభమైన తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాలుగవ మహాసభలు
సిద్దిపేట జనవరి 4 ప్రశ్న ఆయుధం :
ప్రపంచంలో పాలకవర్గాలు కార్మిక వర్గం, వారి హక్కులు, సౌకర్యాలు, చట్టాలపై దాడులు చేస్తున్నాయని, దేశంలో మోడీ సర్కార్ విద్యుత్తు రంగాన్ని ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (UEEU – CITU) రాష్ట్ర నాలుగో మహాసభలు సిద్దిపేట పట్టణంలోని విపంచి లో కామ్రేడ్ శ్రీహరి, హబీబుల్లా ప్రాంగణంలో యూనియన్ రాష్ట్ర మహాసభలు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్ రావు అధ్యక్షతన శనివారం ప్రారంభమయ్యాయి. ఈ మహాసభను సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ప్రారంభించి మాట్లాడుతూ కార్మికులను కట్టు బానిసలుగా మార్చడానికి, కొంతమంది సంపన్నులు ఆదాని, అంబానీ లాంటివారికి దేశ సంపదను కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నూతన ఆర్థిక విధానాలను తీసుకువస్తే, వాటిని నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం దేశ సంపద, ఓడరేవులు, ప్రభుత్వ సంస్థలను, విద్యుత్తు రంగాన్ని, రైల్వే లను ప్రవేట్ పరం చేయడానికి, ఆదాని, అంబానీలకు దోచి పెట్టడానికి సంస్కరణలు చేస్తున్నారని అన్నారు. నూతన విద్యుత్ సవరణ చట్టాలు అమలు అయితే ముందుగా ఉద్యోగులే ప్రమాదానికి గురవుతారని, గతంలో ప్రభుత్వ రంగ సంస్థలలో విదేశాలకు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఇచ్చారని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం హోల్ సేల్ గా అమ్మడానికి ఒక శాఖను ఏర్పాటు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, అమ్మడం లాంటివి ప్రభుత్వాలు చేసేవని, ఇప్పుడు కాలుష్యం తగ్గించాలని నేపంతో సోలార్, సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహిస్తున్నారని, ఇది విద్యుత్తు రంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి అన్నారు. గతంలో కేంద్రం మూడు నల్ల చట్టాలను తెస్తే ఐక్యంగా పోరాడి వాటిని తీసుకురాకుండా చేశామని, కానీ నేడు వివిధ రూపాలలో వాటిని తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తుందని అన్నారు. మరోసారి కూడా రైతులు ఢిల్లీలో ఉద్యమిస్తున్నారని, కేరళ తరహాలో రుణ విముక్తి చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్ ద్వారా కార్మిక వర్గాన్ని వారి హక్కులను కేంద్రము కాళ్ల రాయడానికి ప్రయత్నిస్తుందని, వచ్చే ఏప్రిల్ ఒకటి నుండి ఆ కోడ్ లు అమలు చేయాలని కార్పొరేట్ శక్తులు, మతోన్మాదులు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయని అన్నారు. లేబర్ కోడ్ లు అమలు కాకుండా మిలిటెంట్ ఉద్యమాల కైనా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 2023 విద్యుత్ సవర్ణ చట్టాలు, ఇతర సంస్కరణల వల్ల తెలంగాణ ప్రాంతంలో ఆహార సంక్షోభం వచ్చే అవకాశం ఉందని, ఇక్కడ ఎక్కువ రైతులు బోరు బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు విద్యుత్ కార్మికుల గురించి, ఇతర ఎన్నో రకాల హామీలను ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయడం లేదని అన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థ అంటే బానిస వ్యవస్థ అని, వారికోసం మొదటగా ఉద్యమించింది సిఐటియు మాత్రమే అని అన్నారు. విద్యుత్ చార్జీల నియంత్రణ కోసం, విద్యుత్తు రంగాన్ని కాపాడడానికి కామ్రేడ్ కిరణ్ జీబు జాత చేపట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆర్టిజన్లను కన్వర్షన్ చేయించడానికి, పీస్ రేటు, మీటర్ రీడింగ్ చేసే వారిని రెగ్యులర్ చేయడానికి సిఐటియు మీ వెంట ఉందని అన్నారు. వివిధ సంఘాలను ఐక్యంగా పోరాటం చేయడానికి సిఐటియు వారధి, సారధిగా ముందు ఉంటుందని, స్వతంత్రంగా పోరాటం చేస్తుందని అన్నారు. అనంతరం రాష్ట్ర మహాసభలో ఈ ఈ ఎఫ్ ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సుదీప్ దత్ మాట్లాడుతూ చండీగర్ లో 500 మంది రెగ్యులర్, 500 మంది ప్రవేట్ ఉద్యోగులు విద్యుత్తు రంగంలో పనిచేస్తున్నారని, ఖర్చు ఎక్కువ అవుతుందని కేంద్రమంత్రి అమిత్ షా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీ కలకత్తా కంపెనీ కి అమ్మడానికి ప్రయత్నించగా, ఆ 500 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యులు 5000 మందిగా మారి, ఇంటింటికి తిరుగుతూ విద్యుత్ ప్రవిటికరణ చేస్తే జరుగు నష్టాలను వివరించారని, ప్రజా భాగస్వామ్యంతోనే అక్కడ ప్రైవేటీకరణను నియంత్రించారని, వారికి తెలంగాణలో కూడా మద్దతుగా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడానికి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారని అన్నారు. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్రలలో విద్యుత్ ప్రవేటకరణ చేయడానికి చర్యలు చేపడుతున్నారని అన్నారు. తెలంగాణలో సుమారు 2000 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా, ప్రభుత్వం బొగ్గు, జలవనరుల ద్వారా ప్రస్తుతం 650 మెగాపట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని, ప్రవేట్ సోలార్ కంపెనీల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, దీనివల్ల విద్యుత్ రంగం కుంటుపడే అవకాశం ఉందని అన్నారు. ఇతర రాష్ట్రాలలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడానికి చర్యలు చేపట్టినప్పుడు తెలంగాణలో వారికి మద్దతుగా కార్యక్రమాలు చేపట్టారని, ఇక్కడ కూడా విద్యుత్ ప్రైవేట్ పరం చేస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మద్దతుగా ఉంటారని, ఐక్య ఉద్యమాలతోనే ప్రైవేటీకరణను అపవచ్చని అన్నారు. నవతెలంగాణ ఎడిటర్ సుధా భాస్కర్ ఆహ్వాన సంఘం చైర్మన్ గా సందేశం ఇవ్వాల్సి ఉండగా, అనారోగ్య కారణం చే ఆయన హాజరు కాకపోవడంతో ఆయన పంపించిన సందేశాన్ని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవర్ధన్, రాష్ట్ర అధ్యక్షుడు అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎల్లయ్య, గోపాలస్వామి, యూనియన్ గౌరవ అధ్యక్షులు కుమారాచారి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాట మధు, యూనియన్ కంపెనీ అధ్యక్షులు చంద్రారెడ్డి, యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గుంటుపల్లి సుధాకర్,యూనియన్ జిల్లా అధ్యక్షుడు ర్యాకం అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాళ్ల బండి శశిధర్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, యూనియన్ నాయకులు నాగేందర్ రెడ్డి, కనకరాజు, శ్రావణ్, రవికుమార్ గౌడ్, గిరి గౌడ్, కరుణాకర్, పర్ష రాములు, భూపతి రాజు, భాస్కర్ జిల్లా నలుమూల నుండి ప్రతినిధులు హాజరయ్యారు.