పోలీస్ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం.

పోలీస్ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం

వశిష్ట కళాశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

కామారెడ్డి జిల్లా ఇంచార్జ్

( ప్రశ్న ఆయుధం )అక్టోబర్ 27:

పోలీస్ అమరవీరులు వారోత్సవాల సందర్భంగా కామారెడ్డి జిల్లా వశిష్ట జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

జిల్లా ఎస్పీ శ్రీ M. రాజేష్ చంద్ర IPS ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అక్టోబర్ 2024 నుండి అక్టోబర్ 2025 వరకు దేశవ్యాప్తంగా 191మంది పోలీస్ అధికారులు విధి నిర్వహణలో వీరమరణం పొందినట్లు, అలాగే కామారెడ్డి జిల్లాలో 2001 వరకు 7మంది పోలీస్ సిబ్బంది తీవ్రవాదుల దాడిలో అమరులైనట్లు పేర్కొన్నారు.

కళాబృంద ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, U. శేషరావు లు అమర వీరుల యాదిలో పాటలతో, మాటలతో అవగాహన కల్పించారు. సైబర్ నేరాల నివారణకు టోల్ ఫ్రీ నంబర్ 1930, అత్యవసర సమయంలో DAIL 100 కి కాల్ చేయాలని సూచించారు. షీ టీమ్స్ సభ్యులు WPC సౌజన్య, PCs భూమయ్య మహిళా భద్రతపై అవగాహన కల్పించారు. భరోసా టీమ్ మైనర్లపై జరిగే నేరాల నివారణపై విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించారు.

ఈ కార్యక్రమంప్రిన్సిపాల్ M. రాజు, ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ T. నరసింహులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment