పాఠశాల ముందు ప్రమాదపు కోనేరు.. విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకం

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 20 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శ్రీరామ్ నగర్ కాలనీ రామాలయం వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాల ముందు ఉన్న కోనేరు ప్రమాదకర ఉండడం తో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఈ కోనేరు వద్ద ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపడానికి భయపడుతున్నారు. “పాఠశాల ముందు ఉన్న ఈ కోనేరు చాలా ప్రమాదకరంగా ఉంది. ఇప్పటికే ఇక్కడ  ప్రమాదాలు జరిగాయి. ఈ కోనేరు చుట్టూ తగిన రక్షణ కంచె ఏర్పాటు చేయాలి. లేకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది” అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ కోనేరు చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now