ఇద్దరు పిల్లలకు ఒకే ఆధార్ నంబర్
రెండు కుటుంబాలకు ఇక్కట్లు
వరంగల్ జిల్లా గుండ్లపహాడ్‌లో ఘటన
వరంగల్ జిల్లా: నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్‌లోని రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు బాలురకు ఒకే ఆధార్ నంబర్ వచ్చింది. దీంతో ఆ బాలుర కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. గుండ్లపహాడ్ గ్రామానికి చెందిన మనుబోతుల సుమన్ కుమారుడు ధనుష్, కత్తెరపెల్లి బాబు కుమారుడు శివకు ఒకే ఆధార్ నంబర్ (3996 7128 3843) జారీ అయింది. ప్రస్తుతం ధనుష్ 4వ తరగతి, శివ 5వ తరగతి చదువుతున్నారు. పాఠశాలలో చేర్పించేటప్పుడు ఇద్దరి ఆధార్ నంబర్లు ఒకటే అన్న విషయం వెలుగులోకి వచ్చింది.