Site icon PRASHNA AYUDHAM

ఏసీబీకి చిక్కిన అవినీతి గ్రామపంచాయతీ కార్యదర్శి

IMG 20250829 WA0089

ఏసీబీకి చిక్కిన అవినీతి గ్రామపంచాయతీ కార్యదర్శి

టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు

జమ్మికుంట వీణవంక ఆగస్టు 29 ప్రశ్న ఆయుధం

లంచం తీసుకుంటూ ప్రభుత్వ అధికారి ఏసీబీకి ప్రత్యక్షంగా పట్టుబడిన సంఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో చోటుచేసుకుంది కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి కంభం నాగరాజు 20వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ డి.ఎస్.పి విజయ్ కుమార్ బృందానికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు చల్లూరు గ్రామంలో ఒక వ్యక్తి ఇంటి నిర్మాణానికి ఇంటి నెంబర్ ఇవ్వాలంటే 20వేల రూపాయలు కావాలని డిమాండ్ చేశారు వెంటనే సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారి సూచనలు మేరకు శుక్రవారం రోజున ఏసీబీ డిఎస్పి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో డబ్బులు స్వీకరిస్తున్న సమయంలో గ్రామపంచాయతీ కార్యదర్శి నాగరాజును ప్రత్యక్షంగా పట్టుకొని అరెస్టు చేశారు ప్రభుత్వ అధికారులు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించాలని లేదా 1064 నెంబర్ కి సమాచారం అందిస్తే తగు సూచనలు ఇస్తామని ఏసీబీ డిఎస్పి విజయ్ కుమార్ తెలిపారు

టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న గ్రామస్తులు

గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజు ఏసీబీ పట్టుకోవడంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకుని టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు

Exit mobile version