*రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలు మరువలేనివి:*
*జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి*
సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవ వేడుకలు మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి స్మరించుకున్నారు. అనంతరం రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలను కలెక్టర్ తెలిపారు. “హమారా విధానం, సంవిధాన్ – హమారా స్వాభిమాన్” అనే నినాదంతో కార్యక్రమం సాగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆవిష్కరించిన విలువలను గౌరవించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. కులమత బేధాలను పక్కన పెట్టి, దేశ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
రాజ్యాంగంలోని పౌర హక్కులు ప్రతి ఒక్కరికీ సమానంగా చేరేలా చూడాల్సిన బాధ్యత మనందరిది అన్నారు. ఉద్యోగులు తమ విధులను కర్తవ్యంగా భావించి నిష్టతో పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మజారాణి, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.