అనాధలుగా మారిన అక్కాచెల్లెళ్ళు

*అనాధలుగా మారిన అక్కాచెల్లెళ్ళు*

•కాంగ్రెస్ నాయకులు ట్రాక్టర్ ఇవ్వడానికి నిరాకరణ

•పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ కూడా రాలేదు

•మాజీ సర్పంచ్ కుమారుడు రథసారధిగా మారి అంత్యక్రియలు చేశారు

•భాగ్య భార్గవిలకు దిక్కెవరు

* సంగారెడ్డి ఫిబ్రవరి 07*

కేరూర్ గ్రామంలో విషాదం నెలకొంది తల్లి మరణించడం తో ఇద్దరుఅక్కాచెల్లెళ్లు అనాధలు అయ్యారు…. గ్రామంలో ఒక ఒంటరి మహిళా గత కొంతకాలంగా కేరూర్ గ్రామంలో నివాసం ఉంటోంది ఆవిడకు వెనక ముందు ఎవ్వరు లేక పొగ గత కొన్ని రోజులుగా బురగల్ల భేదేమ్మ అనారోగ్యం తో బాధపడుతూ శుక్రవారం చనిపోయింది ఆమెకు ఎవరు లేరు కాబట్టి అనాధగా ఉంటుంది ఆమె అంత్యక్రియలు జరపడానికి గ్రామ కాంగ్రెస్ నాయకులు నిరకరించారని గ్రామ పంచాయితీ ట్రాక్టర్ ఆ శవాన్ని తీసుకెళ్లడానికి వద్దు అని డ్రైవర్ కు చెప్పడం తో ట్రాక్టర్ డ్రైవర్ కూడా రాలేదు. అది గమనించిన కేరూర్ గ్రామ మాజీ సర్పంచ్ (కుమారుడు) ప్రభాకర్ మరియు గ్రామ యువకులు తన సొంత ఖర్చులతో , అంత్యక్రియలు చేశారు అంతేకాకుండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ కు మాజీ సర్పంచ్ కుమారుడు ప్రభాకర్ రథసారధిగా వ్యవహరించి అట్టి అనాధ శవానికి అంత్యక్రియల నిర్వహించారు

Join WhatsApp

Join Now