- వినాయకనగర్ రోడ్ల పరిస్థితి దారుణం
- అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు
హైదరాబాద్, మల్కాజిగిరి:మల్కాజిగిరి నియోజకవర్గంలోని వినాయకనగర్, దీన్ దయాల్ రోడ్ నంబర్ 2 రహదారి పరిస్థితి ప్రతి వర్షాకాలంలో ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. చిన్న వర్షం కురిస్తే చాలు – రోడ్డంతా బురద, మురుగు నీరు, లోతైన గుంతలతో చిత్తుగా మారుతోంది.చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ప్రతిరోజూ బురదలో నడవాల్సి వస్తోంది. వాహనదారులు ప్రమాదానికి లోనవుతున్నారు. దోమలు పెరిగి వ్యాధులు వ్యాప్తి అవుతున్నాయి. ఇదంతా ప్రజలకు అనేక సమస్యలు కలిగించడమే కాకుండా, ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమవుతోందన్న అపవాదును తెస్తోంది.“ప్రభుత్వం అభివృద్ధి కోసం కృషి చేస్తోంది. కానీ ఇక్కడి అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఆ పరువు బద్నామవుతోంది. ప్రభుత్వం చేసే మంచి పనులు కూడా ప్రజలకు కనబడట్లేదు,” అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాలనీ వాసుల డిమాండ్లు
- ✅ రహదారిని తక్షణమే బాగుచేయాలి
- ✅ లోతైన గుంతలు పూరించి, కాంక్రీట్ పూత వేయాలి
- ✅ మురుగు నిలిచే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి
✅ నిర్లక్ష్యం చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.కాలనీ వాసులు సహనం కోల్పోతున్నారని, సమస్యకు తక్షణ పరిష్కారం లభించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడానికి సిద్ధమని స్పష్టంగా తెలిపారు.