కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయినిల యొక్క సమస్యల పరిష్కారం PRTU ద్వారానే సాధ్యమవుతుంది.
—-MLC పింగిలి శ్రీపాల్ రెడ్డి ,
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 17
కేజీబీవీలో పనిచేస్తున్న ఉపాధ్యాయినీలు సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, పి ఆర్ టి యు సంఘంతోనే సాధ్యమవుతుందని, గురువారం రోజున భిక్నూరు మండల కేజీబీవీ పాఠశాలను సందర్శించి మాట్లాడిన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి,
కేజీబీవీ లో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన మినిమం టైం స్కేల్, కేర్ టేకర్ నియామకం, సమ్మె కాలానికి వేతనం ఇప్పించే విధంగా ముఖ్యమంత్రి తో చర్చించి, ఉత్తర్వులు వెలువడేవిధంగా కృషి చేస్తానని అంతే కాకుండా ఆర్థికేతర అంశాల పరిష్కారం విషయములో అధికారులతో మాట్లాడి త్వరోలోనే ఉత్తర్వులు ఇప్పిస్తామని వారు పేర్కొన్నారు. గతములో కొన్ని సమస్యలకు పరిష్కారం PRTU ద్వారానే సాధ్యమైనదని ఈ సందర్బంగా గుర్తుచేశారు. సంఘం పైన నమ్మకం ఉంచి సభ్యత్వం 2025 సంవత్సర సభ్యత్వం తీసుకోవాలని తెలియచేసారు.
ఈ సందర్భంగా కేజీబీవీ వారు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. ఆ తరువాత కేజీబీవీ సిబ్బంది MLC శ్రీపాల్ రెడ్డి , PRTU రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్గం, దామోదర్ రెడ్డి,ని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు అల్లాపూర్ కుషాల్, ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు,గిరిధర్, మరియు అనిల్ కుమార్, KGBV స్పెషల్ ఆఫీసర్ హరిప్రియ, శిల్ప, లావణ్య, మరియు KGBV ఉపాధ్యాయినీలు, మరియు PRTU రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు, పాల్గొన్నారు.