–రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల
విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే పరిష్కారమవుతాయని డి సి ఎం ఎస్ చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.
గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి యాజమాన్యం రాష్ట్ర వ్యాప్తంగా 197 మంది ఆర్టిజాన్ కార్మికులను, కేటీపీఎస్ లోని 13 మంది కార్మికులను బదిలీ చేయడం జరిగింది. వారంతా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని హర్షిస్తూ తెలంగాణా విద్యుత్ ఎంప్లాయిస్ హెచ్82 యూనియన్* ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జిల్లా కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ను శాలువా, బొకేలతో సన్మానించడం జరిగింది
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సే కాంగ్రెస్ లక్ష్యం అని అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఎన్నో విద్యుత్ కర్మాగారాలు ఏర్పాటై, వేలాది మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు సమకూరాయన్నారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం అని కొత్వాలఅన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణా విద్యుత్ ఎంప్లాయిస్ హెచ్82 జెన్కో రాష్ట్ర కార్యదర్శి ఆవుల కృష్ణారెడ్డి, జెన్కో వర్కింగ్ ప్రెసిడెంట్ అడుసుమిల్లి హనుమంతరావు, వెంపటి అనిల్, మహేశ్వరం శ్రీనివాసరావు, పోల్కంపల్లి సాంబశివరావు, సయ్యద్ జిలాని, కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, పైడిపల్లి మహేష్, తదితరులు పాల్గొన్నారు.