మద్యం మత్తులో తండ్రిని చంపిన తనయుడు
ప్రశ్న ఆయుధం 30 డిసెంబర్ ( బాన్సువాడ ప్రతినిధి)
తండ్రిని తనయుడు హత్య చేసిన ఘటన రుద్రూర్ మండలం అంబం(ఆర్ ) గ్రామంలో చోటు చేసుకుంది. సిఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామానికి చెందిన మహేబుబ్ (34) అనే వ్యక్తి ఆదివారం రాత్రి తండ్రి, కొడుకుల మధ్య గొడవలు జరిగాయని, తండ్రి హైమద్ నిద్రిస్తున్న సమయంలో మద్యం మత్తులో మహేబూబ్ హత్య చేశాడని తెలిపారు. మృతుని పెద్ద కొడుకు జమీల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు సిఐ వెల్లడించారు. అనంతరం మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.