తండ్రీ కొడుకుల ఘర్షణలో కొడుకు మృతి
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
దేవునిపల్లి పీఎస్ పరిధిలోనీ లింగాపూర్ గ్రామనికి చెందిన వడ్ల నిఖిల్ తండ్రి భాస్కర్ ఇద్దరు గొడవపడగా నిఖిల్ ని తండ్రి భాస్కర్ ఇనుప వస్తువుతో తలపై కొట్టగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. నిఖిల్ గత మూడు నెలల క్రితం గల్ఫ్ నుండి వచ్చి మద్యానికి బానిసై ఏం పని చేయకుండా జల్సా లకు డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించినాడని, ఈ విషయమై ఆదివారం రోజు తండ్రికి కొడుకు నిఖిల్ కి గొడవ జరగగా ఈ సమయంలో తండ్రి భాస్కర్ నిఖిల్ ని తలపై కొట్టగా బలమైన గాయమై సోమవారం కామారెడ్డి జి జి హెచ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతు మృతి చెందడం జరిగిందన్నారు. ఈ విషయమై నిఖిల్ అక్క ఇందల్వాయి మండలం చంద్రయన్ పల్లి గ్రామానికి చెందిన రాళ్లపల్లి ప్రసన్న ఆమె భర్త రాజశేఖర్ లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం అన్నారు.